Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటిలానే కాలుష్యం సమస్యగా మారింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో చేరడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి రావడంతో స్కూల్స్ మరోసారి మూతపడ్డాయి.
Delhi Pollution: ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 475 దాటేసింది. దాంతో అత్యవసర పరిస్థితి జారీ అయింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూల్స్, కళాశాలలపై ప్రభావం పడుతోంది. ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్ అమలవుతోంది.
ఢిల్లీలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకీ కాలుష్యం పెరుగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 475 దాటింది. దాంతో మరిన్ని కఠిన నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఇవాళ్టి నుంచి ట్రక్కులకు ప్రవేశం ఉండదు. కేవలం నిత్యావసరాలు సరఫరా చేసేవాటికే అనుమతి ఉంటుంది. ఎక్కడికక్కడ నిర్మాణ పనులు నిలిపివేయాల్సి ఉంటుంది. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, పవర్ లైన్లు, పైపు లైన్లు, భారీ నిర్మాణాలు ఏవైనా సరే తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ నిలిపివేయాల్సి ఉంటుంది. సరి బేసి వాహన నిబంధనలు కూడా అమలు చేయనున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో పొగమంచుకు కాలుష్యం తోడైంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కాలుస్తున్న పంట వ్యర్ధాల కారణంగా ఆ పొగంతా ఢిల్లీని చుట్టేస్తోంది. ఈ రెండింటికీ పారిశ్రామిక కాలుష్యం తోడవుతోంది. దట్టమైన పొగమంచు, కాలుష్యం కారణంగా 3 విమాన సర్వీసులు రద్దు కాగా 107 సర్వీసులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్ధ్యంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచనలు జారీ అయ్యాయి.
కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరడంతో విద్యాసంస్థలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాలిచ్చేవరకూ స్కూల్స్ పనిచేయవు. ఇప్పటికే 1 నుంచి 5 వ తరగతి విద్యార్ధులకు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి 6 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్ధులకు సైతం ఆన్‌లైన్ తరగతులు జరగనున్నాయి. కాలుష్యం తగ్గేవరకూ అంటే కనీసం 10-15 రోజులు స్కూల్స్ మూతపడి ఉంటాయి.
Also read: Schools New Time Table: ఏపీ స్కూల్స్‌లో కొత్త టైమ్ టేబుల్, గంట పెరగనున్న సమయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.