Schools New Time Table: ఏపీ స్కూల్స్‌లో కొత్త టైమ్ టేబుల్, గంట పెరగనున్న సమయం

Schools New Time Table: ఏపీలో పాఠశాలల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని స్కూల్స్ టైమింగ్స్ పెంచేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ముందుగా ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో అమలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2024, 08:54 AM IST
Schools New Time Table: ఏపీ స్కూల్స్‌లో కొత్త టైమ్ టేబుల్, గంట పెరగనున్న సమయం

Schools New Time Table: రాష్ట్రంలోని స్కూల్స్ పనివేళల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హై స్కూల్స్ పని వేళల్ని మరో గంట పెంచేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరులో అమలు చేసి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 

ఏపీలో పాఠశాలలకు కొత్త టైమ్ టేబుల్ వస్తోంది. స్కూల్స్ పనివేళలు పెరగనున్నాయి. ముందు హైస్కూల్స్ తరువాత క్రమంగా అన్ని పాఠశాలల్లో టైమింగ్ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న పనివేళల కంటే అదనంగా గంట పెరగనుంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం 9 గంటల్నించి 4 గంటల వరకూ నడుస్తున్నాయి. ఇకపై మరో గంట పెరిగి సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్నాయి. ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. ఈ నెల 25 నుంచి 30 వరకూ కొత్త టైమ్ టేబుల్ అమలు చేసిన ఫీడ్ బ్యాక్ పరిశీలిస్తారు. ఉదయం, మద్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయం 5 నిమిషాలు, లంచ్ సమయం 15 నిమిషాలు పెరగనుంది. ఉదయం ప్రతి పీరియడ్ 45 నిమిషాలు కాకుండా 50 నిమిషాలుంటుంది. ఇక మద్యాహ్నం ప్రతి పీరియడ్ 40 నిమిషాలు కాకుండా 45 నిమిషాలుంటుంది. 

స్కూల్స్ పనివేళలు పెంచే నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కొంతమందే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. హైస్కూల్స్ పనివేళలు పెంచే నిర్ణయంపై తల్లిదండ్రుల అభిప్రాయం ఎలా ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది. పనివేళల పెంపు అమలులో ఎదురయ్యే సాధక బాధల్ని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరో గంట అదనంగా పనిచేయాల్సి వస్తుందనే ఉపాధ్యాయలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అర్ధమౌతోంది. 

Also read: Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News