'కరోనా వైరస్' పై ప్రపంచవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా రకాల మార్గాలను ప్రజలు అన్వేషిస్తున్నారు. కరోనా వైరస్  రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఎలా నిరోధించాలనే దానిపై చర్చిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా దేశాల్లో ఏ ఇద్దరూ కలిసినా కరోనా వైరస్ గురించే చర్చిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పుంఖానుపుంఖాలుగా వైరల్ చేస్తున్నారు. ఇవి ఎంతలా వైరల్ చేస్తున్నారంటే .. వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో.. ఈ సమాచారం కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతోంది.  ఇందులో ఒకటి 'మద్యం తాగితే కరోనా వైరస్ సోకదు' అనేది ఎక్కువగా వైరల్ అవుతోంది. 


Read Also: ఈ వైరస్ వచ్చింది.. ఆ వైరస్ పోయింది..!!
 


మద్యం తాగితే కరోనా వైరస్ చనిపోతుందా..? మద్యం తాగే వారికి కరోనా వైరస్ సోకదా.? వైద్యులు ఏం చెబుతున్నారు..? మద్యానికి.. కరోనా వైరస్ కు ఏంటి సంబంధం..? అని చాలా మందికి ప్రశ్నలు తలెత్తవచ్చు. నిజానికి ఈ రెండింటికి అస్సలు సంబంధమే లేదు.  మద్యం తాగితే కరోనా వైరస్ సోకదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం. వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు.  ఇంకా చెప్పాలంటే .. మద్యం తాగిన వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫలితంగా కరోనా వైరస్ కు వారే త్వరగా బాధితులుగా మారే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.  
 
Read Also: చీరలో మిథాలీ రాజ్ క్రికెట్

 


కాబట్టి.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన సూచనలు, వైద్యులు చెప్పిన సూచనలు పాటించండి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..