JEE Mains Last Date: జేఈఈ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అలర్ట్. జేఈఈ పరీక్షలకు అప్లై చేయకపోతే వెంటనే చేయండి. ఇవాళ ఆఖరు తేదీ. ఎన్‌టీఏ నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు ఎలా అప్లై చేయాలంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఇంజనీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 20 నుంచి 29వరకూ జరగనున్నాయి. ఇప్పటికే వివిధ కారణాలతో ఈ పరీక్ష మూడుసార్లు వాయిదా పడినా..ఆ తరువాత ఖరారైంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే ఆఖరు రోజు. వాస్తవానికి సీబీఎస్ఈ పరీక్షలతో క్లాష్ వస్తున్నందున అందరు విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేలా ప్రవేశ పరీక్ష గడువు తేదీని పొడిగించారు. అది ఇవాళ్టితో ముగుస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటల వరకూ అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు.


దరఖాస్తు ఎలా


ముందుగా అభ్యర్ధులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. జేఈఈ మెయిన్స్ 2022 రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేస..సంబంధిత వివరాలు నమోదు చేయాలి. పోస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తరువాత సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి పరీక్ష ఫీజు చెల్లించాలి. నిర్ధారణ కోసం సబ్మిట్ చేసిన తరువాత కన్పించే పేజి డౌన్‌లోడ్ చేసుకోవాలి. జేఈఈ మెయిన్స్ పరీక్ష గత ఏడాది నాలుగు విడతల్లో జరగగా..ఈసారి మాత్రం రెండు దశల్లో జరుగుతుంది. 


అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలి


జేఈఈ మెయిన్స్ 2022 కోసం ముందుగా అధికారిక jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. హోమ్‌పేజ్‌లో కన్పించే జేఈఈ మెయిన్స్ 2022 అడ్మిట్ కార్డుపై క్లిక్ చేయండి. మీకు కన్పించే కాలమ్‌లో మీ అప్లికేషన్ నెంబర్, డేటాఫ్ బర్త్ వవరాలు నమోదు చేసి..సబ్మిట్ చేయండి. మీ జేఈఈ మెయిన్స్ 2022 అడ్మిట్ కార్డు కన్పిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.


Also read: Tamil Nadu Train Accident: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన ట్రైన్‌.. బయటకు దూకిన ప్రయాణికులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.