Alert in Jammu: జమ్ము సైనిక స్థావరంపై జరిగిన ద్రోన్ దాడితో సర్వం అప్రమత్తమయ్యారు. జమ్ములో పటిష్టమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ద్రోన్ నిరోధక వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ములోని ఇండియన్ మిలిటరీ బేస్‌పై (Military Base)రెండు ద్రోన్లతో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ అప్రమత్తమై..పటిష్ట చర్యల్ని తీసుకుంది. జమ్ములోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో యాంటీ ద్రోన్ వ్యవస్థతో పాటు జామర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, యాంటీ ద్రోన్ గన్స్ ఏర్పాటు చేశారు. ద్రోన్ దాడి ( Drone Attack) జరిగిన నాలుగు రోజుల్లో ఏడు ద్రోన్లు ఎగిరినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ ఉగ్రవాదుల పనిగా అనుమానిస్తున్నారు. జమ్ములోని కీలక సైనిక స్థావరాల్ని టార్గెట్‌గా చేసుకుని వరుసగా దాడులు చేయాలనేది వ్యూహమని తెలుస్తోంది. ఇవాళ కూడా మీరాన్ సాహిబ్, కలుచౌక్-కుంజ్ ప్రాంతాల్లో ద్రోన్లు ఎగిరినట్టు భద్రతా దళాలు తెలిపాయి. ఈ కేసు విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు(NIA)అప్పగించారు.


ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటరీ గ్రేడ్ ద్రోన్లను టెర్రరిస్తులు వినియోగించి ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ ద్రోన్లు చైనాలో తయారైనట్టు దాదాపుగా ధృవీకరణైంది. ఈ ద్రోన్లు నైట్ విజన్, నేవిగేషన్ వ్యవస్థల్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ద్రోన్లను, ఇతర ఎగిరే వస్తువుల్ని నిషేధించారు. యాంటీ ద్రోన్ సిస్టమ్‌కు సంబంధించి అధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేయాలని ఇప్పటికే నిర్ణయమైంది. 


Also read: Work From Home: మరో రెండేళ్ల వరకూ లేదా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం, ఇదే కొన్ని కంపెనీల విధానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook