ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతున్నా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదు. అంతా ప్రశంతంగానే కొనసాగుతోంది. ఐతే ఢిల్లీలోని పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం సాగుతూనే ఉంది.  
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఢిల్లీలోని మంజు కా టీలాలో మాత్రం  కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి . . ఆ పార్టీలో పొసగక బయటకు వచ్చిన నాయకురాలు ఆల్కా లాంబా. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. నేడు పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పోలింగ్ కేంద్రం వద్ద గుమి గూడారు. మరోవైపు అక్కడికి పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్ధం సాగింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఒకరు ..కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దూషించడంతో ..   అక్కడే ఉన్న ఆల్కా లాంబా రంగంలోకి దిగారు. అతని చెంప చెళ్లుమనిపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పక్కకు లాగేశారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని తరిమి వేయడం కనిపించింది.



మంజూ కా టేలా వద్ద జరిగిన ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు.