న్యూఢిల్లీ: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో పాల్గొన్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు అందరినీ భారత్ వివిధ సందర్భాల్లో మట్టుపెట్టింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన కౌంటర్ టెర్రరిజం దాడుల్లో మొత్తం 66 మంది పాక్ ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చగా అందులో 27 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఉన్నారు. 


సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన 45 రోజుల్లోనే ఈ దాడితో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధాలున్న 19 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుపెట్టడం విశేషం.