Amul Milk Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం రేటు క్రమంగా పెరుగుతోంది. దీని తోడు నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి. దేశంలోని అతిపెద్ద పాల సరఫరా సంస్థ అమూల్ పాల ధరలను పెంచుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. అయితే ఆమూల్‌ పాల ధరలను  4 శాతం పెంచినట్లు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(Gujarat Co-operative Milk Marketing Federation) తెలిపింది. దాదాపు లీటర్‌ పాలపై రూ. 2 పెరిగింది.  పెరిగిన పాల ధరలు గుజరాత్‌ పాటు ఢిల్లీ, వెస్ట్‌ బెంగాల్, ముంబైలో అమల్లోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవే కొత్త ధరలు:
అమూల్ పాల ధర ప్రస్తుతం రూ. 2 పెరిగగా.. అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ధరలు కూడా పెరగనున్నాయి. కొత్త ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇక పెరిగిన ధర విషయానికొస్తే.. అమూల్ గోల్డ్ లీటరుకు రూ. 62, అమూల్ శక్తి లీటరుకు రూ. 56, అమూల్ తాజా లీటరుకు రూ. 50తో మార్కెట్‌లో విక్రయించనుంది. అర కేజీ అమూల్ గోల్డ్ ప్యాకెట్ ధర రూ. 31, అమూల్ ఫ్రెష్ ధర రూ. 25కి లభించనుంది.



ఎక్కడెక్కడ ధరలు పెరిగాయి:
అమూల్ పాల సంస్థ కొన్ని రాష్ట్రాల్లోనే ధరలను పెంచింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ముంబై, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలలో ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అమూల్ బ్రాండ్‌తో తాజా పాలను విక్రయించే కేంద్రల వద్ద రేపటి నుంచి  రూ. 2తో కలిపి విక్రయించనుంది.



ధరలు పెంచడానికి కారణాలు ఇవే.?:


కంపెనీ ఖర్చు, నిర్వహణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా పాల రేట్లను పెంచుతున్నట్లు అమూల్ పాల సంస్థ తెలిపింది. ముఖ్యంగా పశువుల దాణా ఖర్చులు 20 శాతం పెరిగడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఈ పాల పెరుగుదల రేట్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని 8 నుంచి 9 శాతం రైతులకు సమకూర్చనుంది.


పాల రేటు పెంచిన మదర్ డెయిరీ..


అమూల్‌ డెయిరీతో పాటు మదర్ డెయిరీ కూడా పాల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.61కి విక్రయించనుంది. ఇందులో బాగా సేల్‌ అయ్యే టోన్డ్ మిల్క్ ధర రూ.51కి.. డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరు రూ.45కు చేరుకున్నాయి. అయితే ఇందులో ఆవు పాల ధర విషయానికొస్తే.. లీటర్‌ పాలకు రూ.53 విక్రయించనుంది. ఇక  టోకెన్ మిల్క్ ధర రేట్లు కూడా పెరిగాయి.. వీటి ధర రూ.46 నుంచి రూ.48కి ఎగబాకింది.  రోజురోజుకు ఖర్చులు పెరగడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని మదర్ డెయిరీ తెలిపింది. అతి పెద్ద పాల సంస్థల్లో మదర్ డెయిరీ ఒకటి కావున.. సాధరణ ప్రజలపై దీని ప్రభావం పడనుంది. అమూల్‌ డెయిరీతో పాటుతో.. మదర్ డెయిరీ పాల ధర కూడా రూ.2 పెంచింది.


Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook