AP TS Weather Forecast: ఐఎండీ ముందుగా ఊహించినట్టే సరిగ్గా మే 19న నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. అక్కడ్నించి మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలో, దక్షిణ బంగాళాఖాతం, , దక్షిణ అండమాన్ వరకూ విస్తరించాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఫలితంగా మే 31న దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి రుతుపపవనాలు ఊహించినట్టే మూడ్రోజులు ముందుగానే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి కదులుతున్నాయి. అనుకున్న సమయానికి మే 31 నాటికి దేశంలో కేరళ తీరాన్ని తాకి దక్షిణాదిలో విస్తరించనున్నాయి. ఫలితంగా సకాలంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తనం కూడా బలహీనపడింది. అంటే నైరుతి రుతుపవనాల కదలికకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీయనున్నాయి.


హైదరాబాద్ నగరం ఇవాళ పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. గరిష్టంగా 33 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండవచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఇవాళ రాత్రి పడే అవకాశముంది. ఇక రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో  మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


మరోవైపు ఏపీలో కూడా రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ద్రోణి బలహీనపడినా ఏపీ, యానాం ప్రాంతంలో ఆగ్నేయంగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. అదే విధంగా దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


Also read: Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook