న్యూఢిల్లీ: covid-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఆంగన్ వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు, సహాయక నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత అంకిత భావం, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని వీరే నిజమైన దేశభక్తులని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరి సంరక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తూ సురక్షితంగా ఉంచేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: లాక్ డౌన్ లో ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం 40 కీ. మీ ల ప్రయాణం..


దేశం కోసం ప్రతి ఒక్కరు చేస్తున్న వ్యక్తిగత త్యాగాలకు, మనం వారికి వారి కుటుంబాలకు ఎంతగానో రుణపడి ఉన్నామని అన్నారు. మరోవైపు తప్పుడు సమాచారం, భయాందోళనలు కరోనా కన్నా ఎక్కువ ప్రమాదకరమని, ఇలాంటి క్లిష్ట సమయంలో కరోనాపై అవగాహన కల్పించడంలో వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి ధైర్యంగా పని చేస్తున్నారని, దేశానికి అవసరమైనప్పుడు ప్రజలకు సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనం అని తెలియజేశారు.


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం


Also Read:  ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos