AOC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందే బంపర్ ఛాన్స్.. రూ.63,200 జీతంతో గోల్డెన్ జాబ్..
AOC Recruitment 2024: ఆర్మీ ఆర్డెన్సు కార్ప్స్ (AOC) అప్లికేషన్లు పోస్టుల భర్తీకి అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో భాగంగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులను వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
AOC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది మీ కల. అయితే, మీకు ఇది బంపర్ ఆఫర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే బంపర్ ఛాన్స్ పొందే అవకాశం వచ్చింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది... ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఏవోసి రిక్రూట్మెంట్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది డిసెంబర్ 22 ఈ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా 723 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ aocrecruitment.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ లో మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్ మాన్, కార్పెంటర్ ,పెయింటర్ ఎంటిఎస్, ట్రేడ్స్ మాన్ వంటి వివిధ గ్రూప్స్ సి సంబంధించిన పోస్టులను భర్తీ చేయనుంది. నవంబర్ 30వ తారీకు ఈ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మీరు నోటిఫికేషన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆర్మీ ఆర్డెన్స్ కార్ప్స్ రాత పరీక్ష, దేహదారుడ పరీక్ష, మెజర్మెంట్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇక ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.18,000 రూ.56,900 వరకు ఉంటుంది. ఇంకా ఫైర్ పోస్ట్మాన్ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హత కలిగి ఉండాలి. మెటీరియల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులకు డిగ్రీ లేదా డిప్లమా చేసి ఉండాలి.ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్ లేదా తత్సమానం పాసై ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా తప్పనిసరి.
ఇదీ చదవండి: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్' సాంగ్‌కు యువతి డ్యాన్స్ వైరల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇంకా వీరి దరఖాస్తు చేసుకునే ఫైర్ మాన్ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి ట్రేడ్ మెన్ కి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ఏజ్ రిల్యాక్సేషన్ ఉంటుందా? లేదా? చెక్ చేయాలి. ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ కూడా ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: పీవీ సింధు అక్క కూడా క్రీడాకారిణి అని మీకు తెలుసా? ఫొటోస్ వైరల్..
ఏవోసి రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం..
అధికారిక aocrecruitment.in ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలో 'సైన్ అప్' క్లిక్ చేసి క్యాండిడేట్స్ లాగిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీకు కావాల్సిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ క్రియ పూర్తి చేయాలి. కావలసిన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook