Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్‌' సాంగ్‌కు యువతి డ్యాన్స్‌ వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Girl Dance Reels At Tirumala: రేపు డిసెంబర్‌ 5వ తేదీ 'పుష్ప2' ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో శ్రీలీల ప్రత్యేకంగా డ్యాన్స్‌ చేసిన 'కిస్సిక్‌' సాంగ్‌ పాటపై ఓ యువతి ఏకంగా తిరుమల కొండ వద్దే డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Dec 4, 2024, 01:08 PM IST
Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్‌' సాంగ్‌కు యువతి డ్యాన్స్‌ వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Girl Dance Reels At Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశుని దర్శనానికి నిత్య వేల మంది భక్తులు వస్తారు. ఆ ప్రాంగణం అంతా భక్తిశ్రద్ధలతో వెల్లివిరుస్తుంది. అలాంటి ఆధ్మాత్మిక ప్రాంతంలో కొంతరు భక్తులు అపవిత్రం చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ యంత్రాంగం తిరుమల ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్స్‌, రీల్స్ వంటివి చేయకూడదని ఎన్నో మార్లు చెప్పినా చాలామంది వినకుండా పెడచెవిన పెడుతున్నారు. దీంతో చిక్కుల్లో పడుతున్నారు.

భక్తితో మెలగాల్సిన ఆ ప్రాంతంలో రీల్స్ చేస్తూ  అపవిత్రం చేస్తున్నారని పలువురు భక్తులు మండిపడుతున్నారు. ఇటీవలె ఓ అమ్మాయి తిరుమల కొండ వద్ద పుష్ప2 సినిమాలోని శ్రీలీల డాన్స్ చేసిన 'కిస్సిక్' సాంగ్ కు డాన్స్ చేస్తూ వైరల్ అయిపోయింది. తిరుమల కొండ దిగువన ఉన్న ప్రాంతం అలిపిరి టోల్గేట్ ముందు డాన్స్ చేసి వీడియో తీసిన యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అవ్వడంతో పలువురు భక్తులు ఆగ్రహం చేస్తున్నారు.

టీటీడీ యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా తిరుమల వద్ద ఇలా రీల్స్‌, ప్రాంకులు చేస్తూ అపవిత్రం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై టీటీడీ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవలే ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ తన ప్రియుడు శివతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాంక్ వీడియోలు చేసి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా ప్రవర్తించారని టిటిడి సీరియస్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏడో మైలురాయి వద్ద పులి అంటూ ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్త వైరల్ అవి ఉంది. దీనిపై భక్తులు టీటీడీ సైతం ఖండించారు. ఒక విధంగా వారిపై కేసు కూడా నమోదు అవుతుందేమోనని వార్తలు కూడా వినిపించాయి.

ఇదీ చదవండి: Rice Bugs: బియ్యం డబ్బాలో పురుగు పట్టిందా? ఈ చిన్ని చిట్కాతో ఎప్పటికీ రావు..

ఇంకా వెంటనే శివ ప్రియాంక జైలు కలిసి తాజాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో భక్తుల దెబ్బలు ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు... అనుకోకుండా జరిగిన సంఘటన దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు చేతులు జోడించి టిటిడి శ్రీవారి భక్తులకు సారీ చెబుతున్నట్లు వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

తాజాగా మరో అమ్మాయి ఇలా తిరుమల అలిపిరిగేటి వద్ద పుష్ప2 'కిస్సిక్‌' పాటపై డాన్స్ చేయడంతో మరోసారి వైరల్ అవుతుంది... భక్తి పేరుతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఇలా రిల్‌ చేస్తూ వ్యూస్‌ పొందడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని, తిరుమలలో ఇలాంటి వారికి చోటు లేదని తిరులమకు వచ్చిన శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేస్తున్న వారిపై ఎలాగైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఉన్న ఈ అమ్మాయి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:  పీవీ సింధు అక్క కూడా క్రీడాకారిణి అని మీకు తెలుసా? ఫొటోస్ వైరల్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News