Ap assembly election results 2024: కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీకి ప్రజలు ఊహించని విధంగా తీర్పునిచ్చారు. మోదీ చార్ సో పార్ అంటూ ప్రజల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సారి బీజేపీకీ స్వయంగా 400 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు మోదీ మేనియాతో సార్వత్రిక ఎన్నికల జరిగే ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు దేశంలో.. అన్నిరకాల ఎగ్జిట్ పోల్స్ లు కూడా బీజేపీ 370 సీట్లు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడించాయి. అంతేకాకుండా..  దేశంలో ప్రజల్లో కూడా బీజేపీ పట్ల ఒక విధమైన సానుకూల వాతావణం ఉన్నట్లు ప్రచారం జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


ఇదిలా ఉండగా.. ఎగ్జీట్ పోల్స్ సర్వేలు, బీజేపీ నేతలు భావించిన ఫలితాలకు పూర్తిగా రివర్స్ లో వచ్చాయి. నిన్న విడుదలైన ఎన్నికలలో ఫలితాలలో బీజేపీకి కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో అధికారం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 272. దీంతో బీజేపీ తమ మిత్రపక్షాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏపీలో కూటమితో బీజేపీ బరిలో దిగిన విషయం తెలిసిందే. టీడీపీకి 16, జేడీయూకు 12 స్థానాల మద్దతు ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి కీలకంగా మారింది. ఇప్పటికే మోదీ, అమిత్ షాలు చంద్రబాబుకు ఫోన్ కాల్ చేసి గెలిచినందుకు విషేస్ చెప్పారు. అంతేకాకుండా.. కేంద్రంలో ఎడ్జీయే కూటమి కన్వీనర్ పోస్టును కూడా చంద్రబాబుకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ లు ఈరోజు ఢిల్లీకి  పయనమయ్యారు.


అదే విధంగా జేడీయూ నేతలు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం మోదీతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చంద్రబాబు ఇప్పుడు గేమ్ చెంజర్ గా మారారని చెప్పుకొవచ్చు. మెయిన్ గా చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి డెవలప్ మెంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై గట్టిగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో చంద్రబాబు మోదీ ఎదుట.. చంద్రబాబు లోక్ సభ స్పీకర్, పదవితో పాటు, రూరల్ డెవలప్ మెంట్, హెల్త్ శాఖలను కోరుతారని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో కీ రోల్ గా మారారని తెలుస్తోంది.


Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..


ఇక బీజేపీ ప్రస్తుతం కూటమిలో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా మోదీ చరిష్మా ఉందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా... ప్రస్తుతం చంద్రబాబు ట్రెండింగ్ లో నిలిచారని చెప్పవచ్చు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ 21 కి , 21 స్థానాలు గెలుపొందారు. దీంతో వంద  శాతం జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter