iPhone 11 manufacturing: న్యూఢిల్లీ: ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ( Apple ) సంస్థ.. ఐఫోన్‌ 11 ( iPhone ) స్మార్ట్‌ఫోన్ల తయారీని భారతదేశంలో కూడా ప్రారంభించింది. తమిళనాడు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంటులో ఈ ఐఫోన్ 11 ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ ఈ సమాచారమిచ్చారు. భారత్లో దీని తయారీ గొప్ప పరిణామమని, ఇది ఊతమిచ్చే విషయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ( Piyush Goyal ) ట్విట్ చేశారు. అంతేకాకుండా కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ (Ravi Shankar Prasad) కూడా ట్వీట్‌ చేశారు. ‘2020లో ఐఫోన్‌ 11, 2019లో ఐఫోన్‌ 7&XR, 2018లో ఐఫోన్‌ 6S, 2017లో ఐఫోన్‌ SE.. దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరుకు ఇదే నిదర్శనం అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. Also read: Selfie: సెల్ఫీ కోసం నదిలోకి దిగిన యువతులు


తమిళనాడు శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లో ఫాక్సా్కన్‌ గత కొన్ని నెలలుగా ఐఫోన్‌ 11ని అసెంబుల్‌ చేస్తోంది. గత నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్‌ ఎక్స్‌ఆర్‌ను కూడా ఫాక్స్‌కాన్‌ తయారు చేస్తుండగా, విస్ట్రాన్‌ సంస్థ ఐఫోన్‌ 7 స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తోంది. అయితే భారత్‌లో తయాయరవుతున్న ఐఫోన్‌ మోడల్స్‌లో ఇది అయిదవది. ఇదిలాఉంటే ఐఫోన్ ను స్థానికంగా తయారు చేయడం వల్ల ఆ కంపెనీ 20 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సిన అవసరముండదు. Also read: Sony ZV-1: సోని నుంచి పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా.. ధర ఎంతో తెలుసా ?