Sony ZV-1: సోని నుంచి పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా.. ధర ఎంతో తెలుసా ?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో చాలా మంది సొంతంగా ఆసక్తికరమైన వీడియోలు ( Interesting videos ) రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వెళ్లే ప్రతీ చోటుకు భారీ సెటప్ కలిగిన డిజిటల్ కెమెరాలు వెంట మోసుకెళ్లే పరిస్థితి లేకపోవడం వీడియో క్రియేటర్స్‌కి పెద్ద ఇబ్బందిగా మారింది.

Last Updated : Jul 24, 2020, 04:26 PM IST
Sony ZV-1: సోని నుంచి పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా.. ధర ఎంతో తెలుసా ?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో చాలా మంది సొంతంగా ఆసక్తికరమైన వీడియోలు ( Interesting videos ) రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వెళ్లే ప్రతీ చోటుకు భారీ సెటప్ కలిగిన డిజిటల్ కెమెరాలు వెంట మోసుకెళ్లే పరిస్థితి లేకపోవడం వీడియో క్రియేటర్స్‌కి పెద్ద ఇబ్బందిగా మారింది. సరిగ్గా అటువంటి Video creators కోసమే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ మేకర్ అయిన సోని ఇండియా SONY Zv-1 Digital camera పేరిట సరికొత్త పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరాను లాంచ్ చేసింది. సోనీ జెడ్‌వి -1 పేరిట సోని ఇండియా భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసిన ఈ పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరాతో హై క్వాలిటీ వీడియోలను రూపొందించడం ఇకపై తేలికైన పని కానుంది. IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే )

సోని ZV-1 డిజిటల్ కెమెరాతో వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్స్ అద్భుతాలు సృష్టించవచ్చని సోని ఇండియా చెబుతోంది. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ కలిగిన ఈ మిని సైజ్ డిజిటల్ కెమెరా బరువు 294 గ్రాములు మాత్రమే. సైడ్-ఓపెనింగ్ వారీ-యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్‌ కూడా ఉంది. ఇండియాలో SONY Zv-1 ధర రూ .77,990 గా ఉంది. ప్రస్తుతం ఈ డిజిటల్ కెమెరా అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా ఆగస్టు 5 నుండే సేల్స్ ప్రారంభం కానున్నట్టు సోని ఇండియా తెలిపింది. ( Also read: WFH option: మహిళలకు ఇదో చక్కటి అవకాశం )

SONY Zv-1 Digital camera తో పాటు వీడియో క్రియేటర్స్‌కి ఉపయోగపడే వ్లాగర్ కిట్, వైర్‌లెస్ రిమోట్ కమాండర్, 64GB అల్ట్రా-హై-స్పీడ్ మీడియా కార్డ్, NP-BX1 అదనపు బ్యాటరీతో పాటు GP-VPT2BT షూటింగ్ గ్రిప్‌ వంటి పరికరాలు ఈ కెమెరా కిట్‌లో ఉంటాయి. ఈ డిజిటల్ కెమెరా ఎంతో యూజర్ ఫ్రెండ్లీ అని సోని ఇండియా వెల్లడించింది. తేలికపాటి, కాంపాక్ట్ ''ఆల్ ఇన్ వన్'' స్టైల్ కెమెరా, సోనీ ZV-1 వీడియో-ఫార్వర్డ్ డిజైన్, కాంపాక్ట్ బాడీ కలిగి ఉన్న ఈ కెమెరాను ఉపయోగించడం కూడా ఎంతో సులువుగా ఉంటుంది అని సోని ఇండియా బిజినెస్ హెడ్ - ముఖేష్ శ్రీవాస్తవ తెలిపారు. ( Also read: Work from home: ఐటి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ )

Trending News