Arvind Trivedi: రావణుడి మృతి..రామ, లక్ష్మణుల సంతాపం..
Arvind Trivedi: ‘రామాయణ్’ ఫేం అరవింద్ త్రివేది గుండెపోటుతో మరణించారు. 1980లో తెరకెక్కిన రామాయణ్ సీరియల్ లో రావణుడి పాత్రతో మెప్పించారు త్రివేది. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు.
Arvind Trivedi Passed Away: ‘రామయణ్’ ఫేం అరవింద్ త్రివేది(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటు(heart attack)తో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ టీవీ, సినీ నటీనటుల సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
రావణుడి పాత్రలో జీవించారు..
1980లో ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’(Ramayan Serial) సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్‌లో అరవింద్ త్రివేది(Arvind Trivedi) రావణుడి(Ravan) పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఇటీవల ఫస్ట్ లాక్‌డౌన్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్ ‘రామాయణ్’ను పున:ప్రసారం చేసింది.
Also Read:Lakhimpur Kheri Violence: లఖింపూర్ ఖేర్ ఘటనలో రైతులపైకి కారు ఎలా దూసుకెళ్లిందో చూడండి.. Video
సరికొత్త రికార్డు
2020 ఏప్రిల్ 16న తిరిగి ప్రసారమైన రామయణ్(Ramayan)ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్(Ramanand Sagar) రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్‌కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం.
కో స్టార్స్ సంతాపం
అయితే గతంలో అరవింద్ కరోనా మృతి చెందినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ స్పందించారు. అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు అరవింద్ మృతి వార్తను కూడా ఆయన వెల్లడించారు. కాగా ఈ సీరియల్‌లో రావణుడిగా అరవింద్ త్రివేదీ నటించగా అరుణ్ గోవిల్.. రాముడిగా, సునీల్ లాహిర్.. లక్ష్మణ్‌గా, దీపిక చిఖిలియా.. సీతగా నటించారు. అరవింద్ మరణానికి వీరంతా సంతాపం వ్యక్తం చేశారు.
గుజరాతీ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు
అరవింద్ త్రివేది తన నటనతో మూడు దశాబ్దాలపాటు గుజరాతీ ప్రేక్షకులను మెప్పించారు. దేశ్ రే జోయా దాదా పరదేష్ జోయా అరవింద అత్యంత ప్రజాదరణ పొందిన గుజరాతీ చిత్రాలలో ఒకటి. అరవింద్ త్రివేది సోదరుడు ఉపేంద్ర కూడా గుజరాతీ సినిమా(Gujarati Movies)లో సుపరిచితమైన పేరు. త్రిమూర్తి వంటి చిత్రాలలో ప్రతికూల పాత్రలను(విలన్) పోషించడం ద్వారా బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందారు. కల్ట్ టీవీ షో విక్రమ్, బేతాల్“(Vikram Aur Betaal)లో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో హిందీ, గుజరాత్ తో సహా దాదాపు 300 చిత్రాల్లో నటించారు అరవింద్ త్రివేది.
Also Read: Samantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం
ఎంపీగా సేవలు
అరవింద్ త్రివేది.. గుజరాత్ రాజకీయాల్లో(Gujarat politics) కూడా రాణించారు. 1991లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) టికెట్‌పై అరవింద్ గుజరాత్‌లోని సబర్కథ నుండి ఎంపీ(MP) అయ్యారు. 1991 నుండి 1996 వరకు అతను MP గా ఉన్నారు. 2002, 2002 లో అతను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) యాక్టింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook