Aryan Khan Case: `ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు`: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్
Aryan Khan drug case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. ఇది కిడ్నాప్, డబ్బు డిమాండ్ కేసు అని ఆరోపించారు.
Aryan Khan case is kidnapping, ransom: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు (Nawab Malik on Aryan Khan case) చేశారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని తెలిపారు మాలిక్. దీనంతటికి సూత్రదారి బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ అని ఆరోపించారు.
ఇది కిడ్నాప్ కేసు..
ఈ కేసు డ్రగ్స్‌కు సంబంధించింది కాదని.. కిడ్నాప్, డబ్బు డిమాండ్‌కు సంబంధించిందని (Aryan Khan Drugs case) పేర్కొన్నారు. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede), మోహిత్ కాంబోజ్ ఇద్దరూ డబ్బు డిమాండ్ చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. వాళ్లిద్దరికి ముందునుంచే సాన్నిహిత్యం ఉందన్నారు.
షారుక్ ఇప్పటికైనా నోరువిప్పాలి..
ప్లాన్ ప్రకారమే ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ షిప్లో పార్టీకి తీసుకెళ్లారని నవాబ్ మాలిక్ అన్నారు. ఆర్యన్ ఖాన్ కాకుండా.. ఇద్దరు ఇతర వ్యక్తులు టికెట్ కొని అతన్ని పార్టీకి తీసుకువెళ్లినట్లు ఆరోపించారు. అందువల్లే ఇది కిడ్నాప్, డబ్బు డిమాండ్‌కు సంబంధించిన కేసు అని చెప్పుకొచ్చారు.
ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి షారుక్‌కు బెదిరుపులు మొదలయ్యాయని.. ఈ విషయాలేవీ బయటకు చెప్పొద్దని కూడా సూచించినట్లు నవాబ్ మాలిక్ వివరించారు. ఇప్పటికైనా షారుక్ నోరు విప్పి నిజాలు బయటకు చెప్పాలని కోరారు.
Also read: PM Modi: ప్రపంచంలోనే పాపులారిటీలో నెంబర్ వన్‌గా మోదీ..తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..
ఇదంతా కుట్ర..
అసలు ఈ వ్యవహారమంతా ఓ కుట్రలో భాగమేనని నవాబ్ మాలిక్ ఆరోపించారు. షిప్లో ఇతర ప్రముఖులకు సంబంధించి ఆధారాలు దొరికినా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఇదంతా చేశారని కూడా ఆరోపించారు.
Also read: Corona Cases In India: దేశంలో కొత్తగా 10,853 కొవిడ్ కేసులు.. 526 మరణాలు
Also read: Chennai Floods: చెన్నైని ముంచెత్తనున్న వర్షాలు, వెంటాడుతున్న 2015 వరద భయం
నవాబ్ మాలిక్ వరుస ఆరోపణలు..
ఆర్యన్ ఖాన్ కేసులో నవాబ్ మాలిక్ ఆరోపణలు చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా పలు ఆరోపణలు చేశారు. వరుస ట్వీట్లతో ఎన్సీబీపై ప్రత్యక్షంగా పశ్నల వర్షం కురిపించారు.
ఇక సమీర్ వాంఖడే అసలు జీవితం ఇదే అంటూ పలు ఫొటోలను కూడా షేర్ చేశారు మాలిక్.
Also read: BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్
ఎన్‌సీబీ ఏమందంటే..
నవాబ్ మాలిక్ వరుస ఆరోపణలపై ఎన్‌సీబీ కూడా స్పందించింది. మాలిక్ ఆరోపణలను చేసేబదులు కోర్టు్కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించింది.
సమీర్ వాంఖడేను ఈ కేసు నుంచి తప్పించేందుకు ముందు.. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేయడం గమనార్హం.
నవాబ్ మాలిక్‌పై పరువు నష్టం దావా..
ఈ కేసు విషయంలో నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలనపై సమీర్ వాంఖడే తండ్రి తీవ్రంగా స్పందించారు. ఆయనపై పరువు నష్టం దావా వేశారు. సమీర్ వాంఖడే నిజానికి ముస్లీం అని.. అయితే ఎస్సీ సర్టిఫికేట్ సాధించి ఉద్యోగం సంపాదించాడని నవాబ్ మాలిక్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే తండ్రి పరువునష్టం దావా వేసినట్లు తెలిస్తోంది.
Also read: Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'
Also read: Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఎక్కడి నుంచి పోటీ... ఇదీ ఆయన రియాక్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook