ఆ జడ్జిమెంట్ ను తప్పుబట్టిన అసదుద్దీన్ ఓవైసీ ; రాజ్యాంగాన్ని చదవి తీర్పు ఇవ్వాలని జడ్జికి క్లాస్
తరచూ బీజేపీ నేతలపై విరుచుకుపడే అసదుద్దీన్ ఓవైసీ ఈ సారి ఓ న్యాయమూర్తి టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు
ఏకంగా హైకోర్టు కోర్డు జడ్జినే టార్గెట్ చేస్తూ అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీర్పును తప్పుబట్టడమే కాకుండా రాజ్యాంగాన్ని మరో చదవి తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తికి సలహా ఇచ్చారు. ఇంతకీ ఎవరా జడ్జి..ఏంటా తీర్పు అని తెలుసుకోవాలని ఉందా అయితే వివరాల్లోకి వెళ్లండి మరి.
హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సభలో మేఘాలయ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ జనాభా సంఖ్య ఆధారంగా భారత్ ను ఇప్పటికే హిందూ దేశంగా మార్చి ఉండాల్సిందని ఓ జడ్జి ఎలా తీర్పు ఇస్తారని ఓవైసీ ప్రశ్నించారు. తాము ఇలాంటి తీర్పును అంగీకరించబోమన్నారు. భారత దేశం ఎప్పటికీ ఒక మతానికి చెందిన దేశం కాజాలదు..అంది హిందుమతమైనా సరే..ఇస్లాం మతమైనా సరే..మరే ఇతర మతమైన సరే. భారత దేశం సెక్యూలర్ దేశంగానే ఉంది. భవిష్యత్తులో అలాగే కూడా అలాగే ఉంటుందన్నారు. దీన్ని ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు
ఈ సందర్భంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి తీరును కూడా ఓవైసీ తప్పుబట్టారు. ఓవైసీ మాటల్లో చెప్పాలంటే ' జడ్డిగారు మీ జడ్జిమెంట్ తప్పు. మీరు రాజ్యంగం ఆధారం చేసుకొని ఇలాంటి తీర్పు ఇవ్వలేరు..ఇలాంటి తీర్పుతో మీరు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు అంటూ మేఘాలయ జడ్జి జస్టిస్ సేన్ ను ఓవైసీ ప్రశ్నించారు. ఒక జడ్జి స్థానంలో ఉంటూ ఇలాంటి అభిప్రాయాలను చెప్పడం సిగ్గుచేటు, ఇప్పటికైనా మోడీ భజన చేయడం మానండి..రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించండి అంటూ ఓవైసీ హితవు పలికారు.