Asaduddin Owaisi Counter RSS:  దేశంలో జనాభా నియంత్రణ, మతపరమైన అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. దేశంలోని ముస్లిం జనాభా గురించి చింతించడం మానేయాలని భగవత్‌ను కోరారు. "బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది... కండోమ్‌లు ఎవరు ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే.. ఈ విషయంలో మోహన్ భగవత్ ఇకపై మాట్లడకపోవడమే బెటరని అసద్ అన్నారు.  టోటల్ ఫెటెర్నిటీ రేట్‌ చూస్తే దేశంలో  ముస్లింల జనాభా పెరగట్లేదని, పైగా తగ్గుతోందని స్పష్టం అవుతుందన్నారు.  జనాభా నియంత్రణ కోసం కండోమ్‌లను ఎక్కువగా వాడుతున్నది ముస్లింలేనని చెప్పారు. ఈ విషయాన్ని మోహన్ భగవత్ ప్రస్తావించరని అన్నారు.  టీఎఫ్‌ఆర్ డేటా ఆధారంగా భగవత్ మాట్లాడాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి వేడుకల్లో  పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు."జనాభాకు వనరులు అవసరం. వనరులను నిర్మించకుండా పెరిగితే అది భారంగా మారుతుంది. జనాభాను ఆస్తిగా పరిగణించే మరో అభిప్రాయం ఉంది. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ జనాభా విధానంపై మనం కృషి చేయాలి" అని అన్నారు. "ప్రజలు తప్పుకు వ్యతిరేకంగా గళం విప్పాలి, కానీ చట్టం యొక్క చట్రంలో పనిచేయడం ద్వారా. తప్పుకు వ్యతిరేకంగా గొంతు ఎత్తడం సాధారణం కావాలి...మనమంతా ఒక్కటిగా ఉండాలని మోహన్ భగవత్ కామెంట్ చేశారు. జనాభా అడ్డు అదుపు లేకుండా పెరగడం వల్ల మతపరమైన సమతౌల్యం దెబ్బతింటుదని, జనాభా నియంత్రణపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇందు కోసం జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాలని భగవత్ సూచించారు.



దారుస్సలాంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన  అసదుద్గీన్ ఒవైసీ.. బీజేపీ సర్కార్ పైనా నిప్పులు చెరిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలో స్వేచ్ఛా స్వాతంత్రాలను కోల్పోయినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో నివసించే ప్రతి ముస్లిం కూడా ఓపెన్ జైలులో ఉన్నట్లుగా భావిస్తోన్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో జరిగిన పరిణామాలను అసద్ ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వీధి కుక్కల కంటే హీనంగా చూస్తోన్నారని ఆరోపించారు. యూపీలో మదరసాలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని గుర్తు చేశారు. గుజరాత్‌లో దాండియా వేడుకలపై రాళ్లు వేశారనే కారణంతో ముస్లిం యువకులను నడి రోడ్డు మీద, పోలీసులు లాఠీలతో చితకబాదారని అన్నారు. వారిని కొడుతుంటే స్థానికులు చప్పట్లు కొడుతూ నిల్చున్నారని.. ఇది భారత స్వాభావిక స్థితి కాదని ఒవైసీ అన్నారు.



Also Read : Hyderabad Rain : వరదలో మునిగిన హైదరాబాద్.. కేటీఆర్ ను ఏకిపారేసిన నెటిజన్లు 


Also Read : Telangana BJP: పదవులు వద్దంటూ హైకమాండ్ కు లేఖలు.. తెలంగాణ బీజేపీలో కలకలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి