ఆరెస్సెస్ చీఫ్ పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
`అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భగవత్ ఎవరు? ఆయనేమన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్టు అనుకుంటున్నారా?` అని ప్రశ్నించారు ఓవైసీ.
ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పై మండిపడ్డారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన - 'అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పడానికి భగవత్ ఎవరు? సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న కేసుపై మోహన్ భగవత్ ఏ అధికారంతో వ్యాఖ్యలు చేస్తారు? ఆయనేమన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్టు అనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.
ఇటీవల అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. అలానే ఆదివారం బీజీపీ నేత సుబ్రమణియన్ స్వామి కూడా రామ మందిరం నిర్మించి తీరుతామని.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని.. వచ్చే దీపావళికి రామ మందిరంలో వేడుకలు జరుపుతామని మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే..! అయితే అయోధ్య రామమందిరం- బాబ్రీ అలహాబాద్ 2010 కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంగళవారం తుదితీర్పు జరగనుంది.