Asian Paints: ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్.. మీ ఇంటిని రక్షించే లామినేషన్
Asian Paints Apex Ultima Protek : ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్‌ను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిపే జాబితాను ఈ కింద పరిశీలించండి.
Asian Paints Apex Ultima Protek : సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇల్లంటే ఒక భద్రత, ఒక ఆత్మీయత. అలాంటి ఇల్లు ఎన్ని అంతస్తులతో ఉందనేది కాదు.. ఎంత ధృఢంగా, ఎంత సౌకర్యవంతంగా ఉందనేది ముఖ్యం. అందుకే ఇంటిని నిర్మించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఇల్లు ఎంత దృఢత్వాన్నీ కలిగి ఉందో చూసుకోవాలి. అలాగే, గోడలకు పెయింటింగ్ అనేది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన విషయంగా చూడొద్దు. దాని వల్ల వర్షం, దుమ్ము ఇంట్లోకి చేరకుండా ఉంటుంది.
మండే ఎండల నుంచి గోడలను రక్షించడానికి పెయింటింగ్ చాలా ముఖ్యమైనది. అయితే ఏ పెయింటింగ్ అయితే ఇంటి గోడలకు ఎక్కువ రక్షణ అందిస్తుందో తెలుసుకోవడం చాలామందికి ఒక సవాల్‌గా ఉంటుంది. లామినేషన్‌తో కూడిన పెయింటింగ్‌తో బయటి గోడలకు రక్షణతో పాటు మెరుపు కూడా వస్తుంది. అందుకే చాలామంది అల్టిమా ప్రొటెక్ ఉత్తమ ఛాయిస్‌గా భావిస్తారు.
ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్ లామినేషన్ పెయింట్ అని చాలా మందికి తెలియదు. ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్ అనేది మీ గోడలను వర్షం, దుమ్ము, తేమ, మండే ఎండల నుంచి రక్షించే లామినేషన్ పెయింట్. ఇది మన దేశంలోని 10 సంవత్సరాల వారంటీతో కూడిన అద్భుతమైన ఫినిషింగ్‌నీ, వాషెబిలిటీనీ అందించే అత్యంత దీర్ఘకాలిక ఎమల్షన్స్‌లో ఒకటి.
ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్‌ను ఉపయోగించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిపే జాబితాను ఈ కింద పరిశీలించండి.
ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్ పర్యావరణహితమైనది. కార్సినోజెన్లు గానీ, భారీ లోహాలు గానీ, ఆల్కైల్ఫెనాల్ ఇథాక్సిలేట్స్ (APEO) గానీ లేకుండా ఉండేలా రూపొందించబడింది. ఇది పేర్కొన్న VOC పరిమితులకు అనుగుణంగా ఉంటుంది.
క్రాక్ బ్రిడ్జింగ్: దీని ఫిల్మ్ బాగా పొడుగ్గా ఉంటుంది. దీని ప్రత్యేకమైన ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ 2 మి.మీ వరకు క్రాక్ బ్రిడ్జింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
స్ట్రక్చరల్ ప్రొటెక్షన్: ఈ బాహ్య ఎమల్షన్ పెయింట్ అద్భుతమైన CO2 డిఫ్యూజన్ (కార్బొనేషన్) నిరోధకతను అందిస్తుంది. కాంక్రీట్ మ్యాట్రిక్స్‌లో రీబార్ తుప్పును నిరోధిస్తుంది.
అల్టిమా ప్రొటెక్ అనేది ఒక లామినేషన్ పెయింట్ అని ప్రజలకు తెలియజెప్పేలా.. అలెగ్జాండర్ బాబు, భగవతి పెరుమాళ్ నటించిన ఒక హాస్యపూరిత ప్రకటనని విడుదల చేసింది. లామినేషన్ పెయింట్, అల్టిమా ప్రొటెక్‌లలో ఏది బెస్ట్ అని వాదించుకునే ఇద్దరు ఇరుగు పొరుగు వ్యక్తుల్లా అలెక్స్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. భగవతి పెరుమాళ్ వారి గురూజీగా వచ్చి.. ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్, లామినేషన్ పెయింట్ రెండూ ఒకటేనని చెప్పేవరకూ ఇద్దరి ఆర్గ్యుమెంట్ కొనసాగుతూనే ఉంటుంది. దీన్నిబట్టి ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్, లామినేషన్ పెయింట్ రెండూ ఒకటేనని అర్థమైనట్లే కదా..!
Also Read: Gate Exam 2022: 'గేట్' పరీక్ష వాయిదా వేయడం కుదరదు... తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
ALso Read: Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook