Gate Exam 2022 Update: 'గేట్' పరీక్ష వాయిదా వేయడం కుదరదు... తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు..

గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 03:29 PM IST
  • గేట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్లు
  • వాయిదా కుదరదని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
  • షెడ్యూల్ ప్రకారమే జరగనున్న గేట్ పరీక్షలు
Gate Exam 2022 Update: 'గేట్' పరీక్ష వాయిదా వేయడం కుదరదు... తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు..

Gate Exam 2022 Update: గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం (ఫిబ్రవరి 3) గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది.

'పరీక్షలను వాయిదా వేయడం కుదరదు. ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ తెరుచుకుంటున్నాయి. అకడమిక్ విషయాల్లో అధికారులే నిర్ణయం తీసుకోవాలి. అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ప్రమాదకరం. విద్యార్థుల భవిష్యత్తుతో మేము చెలగాటం ఆడదలుచుకోలేదు. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది పిటిషనర్లు కోర్టును ఆశ్రయించి పరీక్షలను వాయిదా వేయాలని కోరడం విద్యార్థులను గందరగోళ పరుస్తుంది.' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

గేట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ పిటిషన్లు దాఖలు చేసినవారిలో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని కూడా ఉన్నట్లు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొనడం గమనార్హం. 'కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భిన్నమైనవి. గేట్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరవుతున్నారు. ఇందులో కేవలం 20 వేల మంది మాత్రమే పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. దీనిపై అధికారులే నిర్ణయం తీసుకోవాలి.' అని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది.

మరోవైపు, ఈ కేసులో పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించిన న్యాయవాది సత్పాల్ సింగ్.. ప్రస్తుతం కరోనా (Covid 19) నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ అమలులో ఉందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గేట్ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని చెబుతూ.. పరీక్షల వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టిపారేసింది.  కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. 

Also Read: SSMB28 Shooting: మహేష్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ షూటింగ్ ప్రారంభం.. ముహూర్తపు షాట్ లో నమ్రత

ALso Read: Ketika Sharma Photos: గ్లామర్ డోస్ పెంచేసిన 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News