Assam Assembly Elections Results Live Updates: దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో పరిస్థితి కీలకంగా మారింది. అసోంలో అధికారం ఈసారి ఎవరిది దక్కనుందనేది ఆసక్తిగా మారింది. కౌంటింగ్ ప్రారంభమవుతూనే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు (Assam Assembly Elections) ఎన్నికలు జరిగాయి. అసోంలో మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోసారి అధికారం చేజిక్కిచుకునేందుకు బీజేపీ (Bjp)కూటమి ప్రయత్నించింది. ఫలితాలు కూడా ఊహించినట్టే బీజేపీకు ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ కూటమి 68 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కూటమి 34 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.  


ఈసారి తప్పకుండా అధికారంలో రావాలని భావిస్తున్న కాంగ్రెస్ ( Congress) నేతృత్వంలోని మహా కూటమి పోటీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్థానిక కార్డుతో  కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ కూడా బరిలో నిలిచింది. సీఏఏ, ఎన్ఆర్సీలే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారాయి. 


Also read: Assembly Elections 2021 Results Live News Update: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook