Naxal attack in Chhattisgarh’s Sukma: ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఐఈడీ బాంబులతో ( IED blast ) విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ (CRPF) కోబ్రాకి చెందిన ఒక అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో కోబ్రా బృందం యాంటీ-నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తుండంగా.. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు (Assistant Commandant of CRPF martyred) సహా ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయపడిన వారందరినీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో విమానంలో రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారని బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ వెల్లడించారు. మిగతా వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నక్సలైట్ల దాడి అనంతరం ఈ ప్రాంతంలో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు.  Also read: Sai Dharam Tej: థియేటర్లల్లో సోలోగా సందడి చేయనున్న మెగా మేనల్లుడు


read: Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్


Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe