Sai Dharam Tej: థియేటర్లల్లో సోలోగా సందడి చేయనున్న మెగా మేనల్లుడు

Solo Brathuke So Better | మెగా హీరో సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. కరోనా లాక్‌డౌన్ నుంచి ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో సందడి చేసిన మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Last Updated : Nov 30, 2020, 01:43 PM IST
    1. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’
    2. ఈ చిత్రం డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ శనివారం వెల్లడించారు.
Sai Dharam Tej: థియేటర్లల్లో సోలోగా సందడి చేయనున్న మెగా మేనల్లుడు

Solo Brathuke So Better Movie release date: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ (Solo Brathuke So Better ). కరోనా లాక్‌డౌన్ నుంచి ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో సందడి చేసిన మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా శనివారం వెల్లడించారు.  

 Also Read: Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్

క్రిస్మస్ సందర్భంగా 

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. లవ్ అంట్ ఎంటర్టైన్‌మెంట్ కథాంశంతో ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతాన్ని అందించారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరినీ ఈ చిత్రం చక్కటి వినోదంతో అలరిస్తుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

రెగ్యులర్ షూటింగ్..

కరోనా వల్ల మూతబడిన థియేటర్లు రీ ఓపెన్‌ అయ్యాక టాలీవుడ్ (Tollywood) ‌లో విడుదల కానున్న పెద్ద సినిమా ఇదే కావటం విశేషం. ఈ మేరకు మెగా హీరో సాయిధరమ్‌ ట్విట్ చేశారు. మీ ఈలలు.. గోలలు సందడి వినడానికి చాలా ఎదురు చూస్తున్నాం. థియేటర్లు పున:ప్రారంభంలో ఈ చిత్రం భాగస్వామ్యం కావడం విశేషం. పదండి థియేటర్లకు వెళ్దాం అంటూ ట్విట్ చేశాడు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం మెగా హీరో దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబరు నుంచి రెగ్యులర్‌‌గా నడుస్తోంది.

Also Read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News