Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్

జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Last Updated : Nov 29, 2020, 06:38 AM IST
  • జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి.
  • తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
  • నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు.. అని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.
Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్

Actor Prakash Raj replay to Nagababu: హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‌పై ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. పవన్‌ కల్యాణ్‌ను ఊసరవెల్లి అని.. పార్టీ ఉండి కూడా పోటీ చేయకుండా, తానొక నాయకుడనే విషయమే మరిచిపోయాడంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు (nagababu) మరింత ఫైర్ అయ్యారు. ప్రకాష్‌ రాజ్‌కు కౌంటర్ ఇస్తూ.. రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్‌ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కుసంస్కారి అంటూ ఆయన సినీ జీవితంపై పలు ఆరోపణలు చేశారు. 

అయితే దీనిపై మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు ట్విట్ చేశారు. గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు.. అని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు ప్రకాశ్ రాజ్. అయితే ఇంకా దీనిపై నాగబాబు స్పందించలేదు. Also read: Prakash Raj Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

 

Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News