Ayodhya Mosque: అయోధ్య  రామమందిర నిర్మాణం జరుగుతోంది. మరోవైపు దేశ గణతంత్ర దినోత్సవాన అదే అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయోధ్య ఇకపై రెండు చారిత్రాత్మక ప్రార్ధనాలయాలకు వేదిక కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ( 72nd Republic day Celebrations ) జరుపుకుంటున్న వేళ అయోధ్యలో మసీదు ( Ayodhya mosque ) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వివాదాస్పద రామజన్మభూమి ( Ram janmabhoomi ) అంశం పరిష్కారం తరువాత రామ మందిర నిర్మాణానికి  శంకుస్థాపన జరిగింది. నిర్మాణ పనులు పారంభమయ్యాయి. అటు సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల్లో సువిశాలమైన మసీదు, ఆసుపత్రి, లైబ్రరీ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ( Indo Islamic Cultural Foundation Trust ) ఏర్పాటైంది. అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు.


జనవరి 26న దేశ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ ముందుగా త్రివర్ణ పతాకం  ( Foundation stone for Ayodhya mosque works with flag hoisting ) ఆవిష్కరించి మొక్కలు నాటారు. అనంతరం నిర్మాణపనుల్ని లాంఛనంగా ప్రారంభించారు. మసీదు నిర్మాణ స్థలంలో భూసారం పరీక్షలకు పంపించామని..నివేదిక రాగానే పనులు మొదలుపెడతామని ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ తెలిపారు. మసీదు నిర్మాణ నమూనా ( Ayodhya Mosque Design ) ఇప్పటికే సిద్ధంగా ఉందని..విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని..భారీగా స్పందన లభిస్తోందని చెప్పారు. సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం ఉంటుందని..మసీదు పై భాగం గాజు గోపురంతో ఉంటుందని వెల్లడించారు. 


మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో ఆసుపత్రి నిర్మిస్తున్నట్టు చెప్పారు. మసీదు పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదని..అంతా కలిసి నిర్ణయిస్తామని తెలిపారు. మసీదు నిర్మించబోతున్న స్థలం రామ మందిర నిర్మాణ స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


Also read: Delhi Farmers Protest: ఉద్రిక్తంగా మారిన ట్రాక్టర్ ర్యాలీ, రైతన్నలపై విరిగిన లాఠీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook