హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం రికార్డు సాధించింది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు సేకరించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సుప్రీంకోర్టు ( Supreme court ) చారిత్రాత్మక తీర్పు అనంతరం అయోధ్య ( Ayodhya ) లో శ్రీరామమందిరం ( Ram mandir ) నిర్మాణం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ నేపధ్యంలో నిర్మాణ నిమిత్తం శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ విరాళాలు సేకరించింది. జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 17 వరకూ కొనసాగనుంది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు ( Hundred crores donations ) వచ్చినట్టు..ట్రస్ట్ తెలిపింది. రామ మందిర నిర్మాణం కోసం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ 5 లక్షల విరాళమిచ్చారు. ఓ భారతీయుడిగా ఎవరైనా సరే విరాళమివ్వచ్చని..తప్పులేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైందని..39 నెలల్లో పూర్తి కానుందని చెప్పారు. 


Also read: Covaxin side effects: కోవ్యాగ్జిన్ తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు..ఒకరి పరిస్థితి ఆందోళనకరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook