Padma Awards Presentation ceremony: అవార్డుల ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి పద్మ పురస్కారాలు స్వీకరించిన మొగిలయ్య, గరికపాటి నరసింహా రావు
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్ పథ్ వేదికగా పరేడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేడుకలను ప్రారంభించారు. ఈ పరేడ్ లో దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు.
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Central Universities: దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం పూర్తయింది. దేశంలోని 12 యూనివర్శిటీల వీసీల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
Supreme court Chief justice: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాథ్యతలు చేపట్టబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 48వ ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Supreme court: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీ టీడీపీ ఎంపీలు ( Ap Tdp MPs ) గురువారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ( President Ramnath Kovind ) తో భేటీ అయ్యారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై ఆయనతో చర్చించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించిన రాష్ట్రపతి.. 17వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో సగం మంది తొలిసారి ఎన్నికైన వారేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళా సభ్యులుండటం అభినందించదగిన విషయం అని రాష్ట్రపతి మహిళా సభ్యులను అభినందించారు. ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
ప్రపంచ తెలుగు మహాసభల ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహానికి పుష్పమాలలు వేసి తథాగతునికి నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.