Covaxin side effects: కోవ్యాగ్జిన్ తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు..ఒకరి పరిస్థితి ఆందోళనకరం

Covaxin side effects: కరోనా వైరస్‌పై పోరాటం చివరి అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా బాగుందనుకుంటే ఇప్పుడు దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ విషయంలో..

Last Updated : Jan 17, 2021, 05:29 PM IST
Covaxin side effects: కోవ్యాగ్జిన్ తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు..ఒకరి పరిస్థితి ఆందోళనకరం

Covaxin side effects: కరోనా వైరస్‌పై పోరాటం చివరి అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా బాగుందనుకుంటే ఇప్పుడు దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ విషయంలో..

కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) ‌కు విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ( Vaccination program ) జరుగుతోంది. నిన్న అంటే జనవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi )  లాంఛనంగా ప్రారంభించారు. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) వ్యాక్సిన్ కోవిషీల్డ్ ( Covishield )..రెండోది దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ( Bharat Biotech )‌కు చెందిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) . అయితే కోవ్యాగ్జిన్ మూడవ దశ ప్రయోగాలు జరుగుతుండగానే డీసీజీఐ ( DCGI ) అత్యవసర అనుమతి జారీ చేయడం, వాలంటీర్ మృతి చెందడంతో కోవ్యాగ్జిన్ సామర్ధ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రారంభమైన సందర్బంగా  దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 52 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ బయటపడటం కలకలం రేపింది. వీరంతా కోవ్యాగ్జిన్  వ్యాక్సిన్ ( Covaxin vaccine ) తీసుకున్నవారు కావడం గమనార్హం. కోవ్యాగ్జిన్ తీసుకున్నవారిలో కొందరికి 15-20 నిమిషాల అనంతరం గుండె దడ, తేలికపాటి జ్వరం, అలర్జీ సమస్యలు తలెత్తాయని..వెంటనే చికిత్స అందించడంతో  ఎయిమ్స్ ( AIIMS ) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మరో రెండ్రోజులు వీరిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నారు. 

వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ ( Covaxin side effects ) బయటపడిన 52 మందిలో ఒకరి పరిస్థితి ఆదోళనకరంగా ఉందని తెలుస్తోంది. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని..వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఇవి సాధారణమేనని వైద్యులు తెలిపారు. దేశం మొత్తం వ్యాక్సిన్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసినా..ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆసక్తి కన్పించడం లేదు. తొలి రోజు  8 వేల 117 మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా..కేవలం 4 వేల 319 మాత్రం ముందుకొచ్చారు. 

Also read: Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News