Ram Mandir: వివాదాస్పద బాబ్రీ మసీదు అంశానికి సుప్రీంకోర్టు తెరదించిన తరువాత అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి. మూడు దశల్లో చేపడుతున్న ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తుండటంతో ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు దశల్లో చేపట్టనున్న ఆలయ నిర్మాణ పనుల్ని 2025 నాటికి పూర్తి చేయాలనేది రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆలోచనగా ఉంది. ఇప్పటికే చాలావరకూ పనులు పూర్తయినందున 2024 జనవరి 22వ తేదీన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వీఐపీలకు నో ఎంట్రీ అంటోంది శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు సహా ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవమైనందున ప్రోటోకాల్ ఏర్పాట్లు కష్టమౌతాయని, అందుకే ఎవరూ రావద్దని చెబుతోంది. 


వీఐపీలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ ప్రకటన చేస్తున్నామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రాజ్యాంగబద్ధ ప్రోటోకాల్ కలిగిన వారెవరూ జనవరి 22న అయోధ్యకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా వస్తే వారికి తగిన ప్రోటోకాల్ అందించలేమని, స్థానిక అధికారులకు కూడా ఆ పరిస్థితి ఉండదంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భక్తుల్ని వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. 


రామ మందిరం ఆలయ నిర్మాణ పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి కానుంది. జనవరి 22 నుంచి 26 వరకూ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. రోజుకు 12 గంటలు ఆలయాన్ని తెరిస్తే 70-75 వేలమంది సులభంగా దర్శించుకునే వీలుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 160 స్థంబాల్లో ఐకనోగ్రాఫికల్ వర్క్స్ ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 5న రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి 31 మార్చ్ 2023 వరకూ 900 కోట్ల రూపాయలు ఖర్చయిందని ట్రస్ట్ తెలిపింది. ఇంకా ట్రస్ట్‌కు సంబంధించిన డబ్బులు 3 వేల కోట్లు బ్యాంకుల్లో ఉందన్నారు. 


22 జనవరి, 2023న దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్ధించింది. రాముడి అక్షింతల్ని దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాలకు పంపిణీ చేస్తామన్నారు. 


Also read: Surya Grahan 2023: చివరి సూర్యగ్రహణం రోజున చేయకూడని పనులు ఇవే..తప్పక గుర్తుంచుకోండి.<



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook