Acharya Laxmikant Dixit Dies At 86: అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ (86) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. అతడి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా అతడి అంత్యక్రియలు వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ఇదే కేసులో అరెస్టయిన కవితకు ఏమైంది?


ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రాణప్రతిష్ట ఉత్సవాలు లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ సారథ్యంలో జరిగాయి. ఆయన నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీక్షిత్‌ స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా. వారణాసిలో ఉన్న అర్చకుల్లో దీక్షిత్‌ అగ్రగణ్యులుగా ఉన్నారు. కాశీ క్షేత్రంలో ఆయన అతి పెద్దవారు. ఆయన కుటుంబం వారణాసిలో నివసిస్తోంది. వయసు మీద పడడంతోపాటు వృద్ధాప్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. 

Also Read: UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు


దీక్షిత్‌ మృతిపై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలోనే గొప్ప పండితుల్లో ఒకరని ప్రధాని తెలిపారు. కాశీ విశ్వనాథ్‌ ధామ్‌, అయోధ్య ప్రాణప్రతిష్టలో ఆయన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఓ పోస్టు చేశారు. 'ఆచార్య లక్ష్మీకాంత్‌ కాశీకి చెందిన గొప్ప పండితులు. రామ జన్మభూమి ప్రాణప్రతిష్టలో పాల్గొని పూజలు చేశారు. ఆయన మృతి ఆధ్యత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటు. సంస్కృత భాష, భారత సంస్కృతికి ఆయన చేసిన సేవలను ప్రజలు నిరంతరం స్మృతిలో ఉంచుకుంటారు. రాముడి పాదాల వద్ద ఆయనకు చోటు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.



 






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి