Ayodhya Ram Mandir Latest Updates: అయోధ్య రామయ్య చెంతకు తెలంగాణ సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బంగారు చీరను కానుకగా పంపుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఈ చీరను నేశాడు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను చీరపై పొందుపరిచాడు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఉపయోగించి తయారు చేశారు. ఇందుకోసం 20 రోజుల సమయం పట్టింది. లక్షన్నర రూపాయలు విలువ చేసే ఈ చీరను కానుకగా పంపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామ భక్తులకు పంపిణీ చేయనుంది టీటీడీ. శ్రీరామ‌చంద్రుల‌ వారి విగ్రహ ప్రతిష్ట, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు రెడీ అయింది. అయోధ్యలో దాదాపు లక్ష లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కిలోల భారీ లడ్డును తయారుచేశారు. శ్రీరాముడికి కానుకగా అయోధ్యకు పంపించారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి రూ.46 లక్షలు ఖర్చుతో బంగారు పాదుకలు తయారు చేసి.. స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఆయన దాదాపు 8 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదుకలను బహూకరించేందుకు అయోధ్యకు చేరుకున్నారు.


శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి మూడు వేలకుపైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి వీటిలో ఉన్నాయి. శ్రీలంక ప్రతినిధి బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన రైతు అరవింద్‌ భాయ్‌ మంగళ్‌ భాయ్‌ పటేల్‌ 1,100 కేజీల భారీ దీపాన్ని తయారు చేసి.. స్వామివారికి బహూకరించారు. దీనిని బంగారం, వెండి, రాగి, జింక్‌, ఇనుముతో తయారు చేయించారు.


ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్య ప్రకాశ్‌ శర్మ అనే భక్తులు 400 కేజీల బరువైన తాళం బహుమతిగా ఇస్తున్నారు. యూజీలోని జలేసార్‌లో 2,100 కేజీల బరువైన భారీ గంటను తయారు చేసి బహూకరిస్తున్నారు. ఈ గంటను ఎనిమిది లోహాలతో తయారు చేయగా.. దాదాపు రెండేళ్ల సమయం పట్టింది.


ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం 7,000 కేజీల రామ్‌ హల్వాను నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్‌ విష్ణు మనోహర్‌ తయారు చేశారు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్‌ 200 కేజీల లడ్డూలను తయారు చేయిస్తోంది. సూరత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి రామాలయం థీమ్‌తో రెండు కేజీల వెండి, 5,000 అమెరికన్‌ వజ్రాలతో ఓ నెక్లెస్‌ను తయారు చేయించి, రామ జన్మభూమి ట్రస్ట్‌కు అందజేశారు. 500కు పైగా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు తాను నడయాడిన పుణ్యభూమిలో కాలు పెడుతున్న సమయంలో రామయ్య పైన భక్తితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన బహుమతులు అయోధ్యకు చేరుతున్నాయి.


Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా


Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter