Rammandir Inauguration Date: రామమందిర నిర్మాణ కార్యక్రమం డిసెంబర్ 2023 నాటికి పూర్తి కావల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే ప్రారంభం ఎప్పుడనేది చర్చించాల్సి ఉంది. ఇప్పటికైతే చూచాయగా 2024 జనవరి 1న ప్రారంభించే ప్రతిపాదన ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ జన్మభూమి ట్రస్ట్ కీలక అధికారి ప్రకాష్ గుప్తా అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 2023 నాటికే నిర్మాణం పూర్తవుతుంది. 2024 జనవరి 14-15తేదీల్లో రామ్‌లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠిస్తామని రామ మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు. రామ్‌ల‌ల్లా ప్రతిష్ఠ కంటే ముందు దేశవ్యాప్తంగా 100 కోట్ల సారి హనుమాన్ చాలీసా పఠించనున్నారు. ఈయన అందించిన వివరాల ప్రకారం గర్భగుడి గోడజలు మార్చ్ 31 నాటికి పూర్తయిపోతాయి. మే 7 వరకూ రామ మందిరం కప్పు సిద్ధమౌతుంది. శ్రీ రామ జన్మభూమి పరిసరాల్లో నేపాల్ దేశపు దేవశిలను స్థాపించనున్నారు.


రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుంది. రామ్‌‌లల్లా విగ్రహం ఇందులో బాల్యకాలం నాటిది ఉంటుంది. ఏప్రిల్ 7న రామ్‌లల్లా విగ్రహం ఆర్ట్ వర్క్ తయారౌతుంది. రామ్‌లల్లా 4-5 సంవత్సరాల నాటి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఈ విగ్రహం నిలుచున్న పొజిషన్‌లో ఉంటుంది.


ఏప్రిల్ 8న ఏ రాయితో విగ్రహం తయారుచేసేది నిర్ణయం కానుంది. రామ్‌లల్లా విగ్రహం అయోధ్యలోనే తయారౌతుంది. విగ్రహం తయారు చేసేటప్పుడు ఆధ్యాత్మిక ఉచ్ఛారణ ఉంటుంది. రామ్‌లల్లా విగ్రహం తయారీకు 6 నెలల సమయం పడుతుంది. వచ్చే రామనవమి కంటే ముందే రామ్‌లల్లా గర్భగుడిలో విరాజిల్లనున్నారని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రధాని మోదీ సూచనల ప్రకారం రామ మందిరం పరిసరాల్లో మహర్షి వాల్మీకి, శబరి, నిషాద్ రాజ్ మందిరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా మర్యాద పురుషుడు రాముడి మర్యాద ప్రతి ఒక్కరికీ చేరుతుంది.


Also read: Indore Tragedy: శ్రీరామ నవమి వేడుకల్లో పెను ప్రమాదం.. కుప్పకూలిన మెట్లబావి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook