Ayyappa Devotees, Irumudi Kettu: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇక ఇబ్బంది లేదు
Ayyappa devotees can take flight now: జనవరి 20న మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల దీక్షలు ముగియనుండగా.. అప్పటి వరకు మాత్రమే అయ్యప్ప భక్తులకు ఇరుముడితో పాటు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ బ్యూరో స్పష్టం చేసింది.
Ayyappa devotees can take flight now: శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని తీసుకెళ్లే విషయంలో ఇబ్బందులు తొలగిపోయాయి. ఇరుముడి కట్టుకుని శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఇరుముడిని ఇకపై విమానం క్యాబిన్‌లో తమ వెంటే తీసుకువెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విమానాశ్రయంలో చెకిన్ ముగిసిన అనంతరం ఇరుముడిని క్యాబిన్‌లోకి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులను అనుమతించాలని స్పష్టంచేస్తూ అన్ని విమానాశ్రయాల యాజమాన్యాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 20న మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల దీక్షలు ముగియనుండగా.. అప్పటి వరకు మాత్రమే అయ్యప్ప భక్తులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ బ్యూరో స్పష్టం చేసింది.
ప్రతీ సంవత్సరం అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకుని శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారనే సంగతి తెలిసిందే. శబరిమలకు వెళ్లే భక్తులు తమ సొంత ప్రదేశాల నుంచే శబరిమలకు ఇరుముడి నెత్తిన పెట్టుకుని వెళ్తుంటారు. ఇరుముడిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయతో పాటు అయ్యప్పకు నైవేద్యాలను తీసుకువెళ్లడం ఒక ఆనవాయితీ.
అయితే నెయ్యితో పాటు కొబ్బరికాయకు మండే స్వభావం ఉన్న కారణంగా విమానంలో ఇదివరకు ఇరుముడిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతించే వారు కాదు. కానీ అయ్యప్ప మాల ధరించే భక్తుల ( Ayyappa mala deeksha rules ) నుంచి ఎప్పటి నుంచో వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ బ్యూరో.. కేవలం అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మకర జ్యోతి దర్శనం పూర్తయ్యే వరకు మాత్రమే అయ్యప్ప భక్తులకు ఆ వెసులుబాటును కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డులు మొత్తం రద్దు
Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..
Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook