Who Can take Ayyappa Deeksha: కేరళలోని శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అసంఖ్యాక భక్తకోటి వెళుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆయనను దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆయనను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాల ధారణ చేసి వెళుతూ ఉంటారు.
41 రోజుల పాటు నియమనిష్టలతో మాలధారణ చేసి ఆయన దర్శనం కోసం వెళతారు. అయితే ఈ మాల ధారణ ఎవరెవరు చేయవచ్చు? ఎవరెవరు చేయకూడదు అనే విషయం మీద పలువురికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే మేము పలు మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
సాధారణంగా మాలధారణ చేయాలి అంటే ముందుగా అయ్యప్ప మీద నమ్మకం ఉండాలి. అసలు మాలధారణకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలు మాలధారణ చేయించే గురుస్వాముల నుంచి తెలుసుకోవాలి. మాలధారణకు సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ తెలుసుకున్న తరువాత తాము మాలధారణ చేసి నియనిష్టలతో అయ్యప్పకు పూజ చేయగలం అనుకున్న తర్వాతే ఎవరైనా మాలధారణ చేయాలి.
మాలధారణ చేయడానికి తల్లిదండ్రుల లేదా వివాహం జరిగితే వారి భార్య అనుమతి తప్పనిసరి. పురుషులు ఏ వయసు వారైనా మారధారణ చేయవచ్చు కానీ స్త్రీలు మాత్రం ఋతుచక్రం మొదలు కాకముందు, అది నిలిచిపోయిన తరువాత వారు మాత్రమే మాలధారణ చేయాలి. ఇక కొన్ని సందర్భాలలో మాలధారణ చేయకూడిని పరిస్థితులు కూడా పురుషులకు ఏర్పడతాయి. ఆ సందర్భాలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం.
తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది కాలం వరకు మాల ధరించకూడదు. ఒకవేళ సవతి తల్లిదండ్రులు మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు. అదే భార్య మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు. ఒకవేళ సవతి భార్య (రెండవ భార్య) మరణిస్తే 3 నెలల వరకు మాల ధరించకూడదు.
పెద తండ్రులు , పినతండ్రులు , పెద్ద తల్లులు , పినతల్లులు , మరణిస్తే 3 పక్షములు అంటే (45 రోజులు) మాల ధరించకూడదు. ఇక సోదరులు , పుత్రులు , మేనత్త , మేనమామ , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) మరణిస్తే 41 దినములు మాల ధరించకూడదు.
కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినలు , మరుదులు , బావలు , బావమరుదులు మరణిస్తే (30) దినములు (1 నెలపాటు) మాల ధరించకూడదు. మనవళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు మరణిస్తే కనుక 21 దినములు మాల ధరించకూడదు. ఇంటి పేరు గలవారు , రక్త సంబంధీకులు మరణిస్తే 21 దినములు మాల ధరించకూడదు. అలాగే వియ్యాలవారు , దూరపు బంధువులు మరణిస్తే 13 దినములు మాల ధరించకూడదు. ఆత్మీయులు , మిత్రులు మరణిస్తే 13 దినములు మాల ధరించకూడదు.
ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మరణిస్తే అతనికి ఏడాది కాలం సూతకముంటుంది కనుక మాల ధరించకూడదు. దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు మరణిస్తే (6) నెలలు సూతకముంటుంది కాబట్టి మాల ధరించకూడదు. పైన తెలిపిన వారిలో ఎవరు మరణించినా వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేస్తే వారికి కూడా ఏడాది సూతకముంటుంది. కాబట్టి వారు కూడా ఏడాది కాలము మాల ధరించకూడదు. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , వంటి వారు వారు 7 నెలల గర్భిణి అయితే మాల ధరించి దీక్ష తీసుకో కూడదు.
ఎందుకంటే దీక్షలో ఉండగా వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకం వస్తుంది , కాబట్టి మాల విసర్జన చేయవలసి వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన వారు మాల ధరించ కూడదు. ఇక దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన మరణిస్తే ఆ వార్త తెలియగానే మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవాలి, అలా కాక మాలో మాకు మాటలు లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాలతీయకుంగా సూతకముతో పావన శబరి గిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు చెబుతున్నారు.
Also Read: Shani Gochar 2023: శని గ్రహం సంచారం వల్ల ఈ రాశువారికి.. ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం మొదటి నెల దాకా డబ్బే డబ్బు..
Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook