Azadi Ka Amrit Mahotsav:  భారత్‌లో ప్రస్తుతం 75వ స్వాతంత్ర్య అమృత్ ఉత్సవ (Azadi Ka Amrit Mahotsav) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటునట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 75 ఏళ్లలో మన దేశం చాలా ఎంతో అభివృద్ధి చెందింది. దేశ నిర్మాణం కోసం ఎంతో మంది త్యాగాలు ఫలితంగానే మనకు స్వరాజ్యం ఏర్పడింది. ముఖ్యంగా దేశ నిర్మంణంలో భాగంగా చాలా మంది దేశం కోసం తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. ప్రస్తుతం భారత్‌ ఈ స్థాయిలో అభివృద్ధి చెండానికి ప్రధాన కారణం ఎందరో మహానుభావుల కృషి ఫలితాలే.. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటాల్లో చాలా మంది మహిళలు కూడా తమ వంతు పోరాటాలు చేశారు. వీరిలో రాణి లక్ష్మీబాయి నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరకు ఉన్నారు. వీరు దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివి కావున ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉత్సవలో భాగంగా దేశం కోసం కృషి చేసిన ధీర వనితల గురించి జీ తెలుగు న్యూస్‌ ప్రత్యేక కథనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరే ఆ  ధీర వనితలు:


రాణి లక్ష్మీబాయి:
బ్రిటీష్ వారి చట్టాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసింది. దేశ భూమిని బ్రిటీష్ రాజుల నుంచి కాపాడు కోవడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిపైకి యుద్దానికి దిగిన వీర నారి ఆమె. బుందేల్‌ఖండ్‌లోని భారత తిరుగుబాటుదారులతో కలిసి ఈస్టిండియా(East India Company) కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేసిన ధీర వనిత. చివరకు రాణి లక్ష్మీబాయి బ్రిటీష్ వారితో పోరాడి మాతృభూమిని రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసింది.


రాణి చెన్నమ్మ:
రాణి చెన్నమ్మ దక్షిణ భారతదేశంలోని కర్ణాటకకు చెందినవారు. రాణి చెన్నమ్మ గుర్రపు స్వారీ, విలువిద్య, ఫెన్సింగ్ నైపుణ్యంలో ఎంతో ఆరితేరిన వారు ఆమె. బ్రిటీష్ వారి అరాచక పాలన వ్యతిరేకంగా  ఒంటరిగా తిరుగుబాటు చేశారు. 1829లో జరిగిన యుద్ధంలో రాణి చెన్నమ్మ బ్రిటీష్ వారితో పోరాడుతూ ప్రాణాలు విడిచారు.


రాణి అహల్యాబాయి హోల్కర్:
రాణి అహల్యాబాయి హోల్కర్  బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తన 27 మంది కుటింభికులను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ఆమెలో దేశ భక్తి ఏ మాత్రం కోల్పోకుండా దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించారు. ముఖ్యంగా ఆమె కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు.  రాణి అహల్యాబాయి హోల్కర్ బ్రిటీష్ ఆక్రమణదారుల నుంచి ప్రజలను రక్షించేవారు.


భిఖాజీ కామా:
 7వ అంతర్జాతీయ కాంగ్రెస్‌లో భారత జెండాను ఎగురవేసిన ఘనత చాటుకున్న వారిలో భిఖాజీ కామా ముందుంటారు. భిఖాజీ కామా సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ  ఆమె తన జీవితాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి అంకితం చేశారు. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో భాధపడుతున్న వారికి సహాయ కార్యక్రమాలు చేసే వారు. 1936లో ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తులకు ఎనలేని సేవలు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన వంతు సేవలు చేసి చివరకు కన్నుమూశారు.


సావిత్రి బాయి ఫూలే:
సావిత్రీ బాయి ఫూలే దేశానికి మొదటి మహిళ గురువుగా ఆమెను పిలుస్తారు. బ్రిటీష్‌ పాలనలో బాలికల అభ్యున్నతి కోసం పోరాడి. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత సావిత్రి బాయి ఫూలేదే. దేశ నిర్మాణంలో భాగంగా ఆమె గోవిందరావు ఫూలేతో కలిసి అంటరానితనాన్ని నిర్మూలించారు. ముఖ్యంగా  దళిత మహిళలకు విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడానికి కృషి చేశారు.


సరోజినీ నాయుడు:
భారతదేశం యొక్క స్వర్ నైటింగేల్‌గా సరోజినీ నాయుడికి ప్రసిద్ధి ఉంది. ఆమె బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేఖంగా అనేక ఉద్యమాలు చేశారు.బ్రిటీష్ వారితో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ కాన్పూర్ సెషన్‌లో సరోజినీ నాయుడు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.


ఇందిరా గాంధీ:
ఇందిరా గాంధీ భారతదేశానికి మొదటి మహిళా ప్రధాన మంత్రి. 4 సార్లు భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. 1971లో ఇందిరాగాంధీ హయాంలో పాక్‌ను ముప్పతిప్పలు పెట్టించారు. ఆమె నిర్ణయానికి  భారతీయులు భారత దుర్గ మాత పేరుతో పిలిచేవారు. ఇందిరా గాంధీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1974లో భారతదేశం మొదటి అణు పరీక్ష నిర్వహించారు.


సుచేతా కృపలానీ:
భారతదేశానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని. 1963లో ఆమె ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటి చేసి భారత్‌కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. దేశ స్వాతంత్య్రానికి ముందు ఆమె ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని  జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అంతేకాకుండా ఆమె  హిందూ యూనివర్సిటీలో ప్రతినిధిగా కూడా పనిచేశారు.


విజయలక్ష్మి పండిట్:
 ఐక్యరాజ్యసమితి (UN) మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్.  అంతేకాకుండా ఆమె భారతదేశానికి మొదటి మహిళా రాయబారి కూడా.. రష్యా, మెక్సికో పండిట్ విజయలక్ష్మి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.  భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనేవారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య కార్యక్రమంలో జరిగే ప్రతి కార్యాక్రమంలో ఆమె పాల్గొనేవారు.


Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !


Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook