Badrinath Temple Opened | లాక్‌డౌన్ కావడంతో దేశంలో ఆలయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పవిత్ర బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. నేటి (మే 15) వేకువజామున 4:30 గంటలకు ఉత్తరాఖండ్‌లో నెలకొన్ని బద్రీనాథుని ఆలయం తెరుచుకుంది. పూలతో ఆలయాన్ని, పరిసర ప్రాంగణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. మార్కెట్‌లో జోష్.. పెరిగిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రోచ్ఛరణ చేస్తూ బద్రీనాథ్ ఆలయం తెరిచారు. అర్చకులు, పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు సహా మొత్తం 28 మంది ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్టు ఏఎన్‌ఐ మీడియా పేర్కొంది. గతేడాది ఆలయం తెరిచిన తొలిరోజే బద్రీనాథుని 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు


తొలుత ఏప్రిల్ 30న ఆలయం తెరవాలని భావించారు. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు వారాలపాటు వాయిదా వేశారు. బద్రీనాథ్ ఆలయం ధర్మాధికారి భువన్ చంద్ర ఉనియాల్ కోవిడ్19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయం తెరవడంపై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 


ఉత్తరాఖండ్‌లోని నర, నారాయణ పర్వతాల మధ్య అలకనందా నది ఎడమవైపు తీరంలో పవిత్ర బద్రీనాథ్ పుణ్యక్షేత్రం కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి అందాలు పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు