Bank Holidays July 2024: దేశంలోని వివిధ బ్యాంకులకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో సెలవులుంటాయి. అందుకే బ్యాంకు పనులున్నవాళ్లు ఏ రోజు ఎక్కడ బ్యాంకులకు సెలవో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కస్టమర్ల ప్రయోజనం కోసం ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా రిలీజ్ చేస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల జాబితాలో 12 రోజులు సెలవులున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి. మిగిలిన రోజుల్లో ప్రాంతీయ సెలవులున్నాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌లోనే పనులు జరుగుతున్నాయి. కానీ కొన్ని పనులకు మాత్రం విధిగా బ్యాంకుకు హాజరుకావల్సిందే. మొత్తం జూలై నెలంతా కలిపి బ్యాంకులకు 12 రోజులు సెలవుంటుంది. ఇందులో ప్రాంతీయ పండుగల్ని పురస్కరించుకుని కొన్ని రాష్ట్రాల్లో సెలవులున్నాయి. జూలైలో ఎప్పుడు ఎక్కడ సెలవుందో తెలుసుకుందాం.


జూలై 3న బెహ్ డియంఖ్లామ్ పండుగ షిల్లాంగ్‌లో సెలవు
జూలై 6న ఎంహెచ్ఐపీ రోజు ఐజ్వాల్‌లో సెలవు
జూలై 7న ఆదివారం సెలవు
జూలై 8న కాంగ్ రథ యాత్ర ఇంఫాల్‌లో సెలవు
జూలై 9న దృప్కా సే జి పండుగ గ్యాంగ్‌టక్‌లో సెలవు
జూలై 13 రెండవ శనివారం సెలవు
జూలై 14 ఆదివారం సెలవు
జూలై 16 హరేలా పండుగ డెహ్రాడూన్‌లో సెలవు
జూలై 17 మొహర్రం దేశవ్యాప్తంగాసెలవు
జూలై 21 ఆదివారం సెలవు
జూలై 27 నాలుగవ శనివారం సెలవు
జూలై 28 ఆదివారం సెలవు


అయితే బ్యాంకులకు సెలవులున్నప్పటికీ ఆయా రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. యూపీఐ లావాదేవీలు, ఏటీఎం లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 


Also read: ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook