ITR Filing 2024: 2023-24 ఆర్ధిక సంవత్సరంతో పాటు 2024-25 అసెస్‌మెంట్‌కు సంబంధించి ఐటీ రిటర్న్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే ఆర్ధిక సంవత్సరంలో మీరు రెండు మూడు ఉద్యాగాలు మారుంటే..సహజంగానే మీ దగ్గర ఫామ్ 16లు ఎక్కువగా ఉండుంటాయి. ఈ పరిస్థితుల్లో రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలనే సమస్య ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. కానీ రెండు మూడు ఉద్యోగాలు మారినవారికి మాత్రం ఒకటి కంటే ఎక్కువ ఫామ్ 16లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ రిటర్న్స్ పైలింగ్ క్లిష్టతరమౌతుంటుంది. ఫామ్ 16 అనేది మీరు ఉద్యోగం చేసే కంపెనీ నుంచి జారీ అవుతుంటుంది. ఇందులో మీ జీతం నుంచి కట్ అయిన టీడీఎస్ వివరాలు పూర్తిగా ఉంటాయి. అవి రెండు భాగాల్లో ఉంటాయి.
ఫామ్ 16 పార్ట్ ఎలో ఉద్యోగి, యజమాని వివరాలు, పేరు, చిరునామా, పాన్ నెంబర్, టాన్ నెంబర్, ప్రతి త్రైమాసికానికి డిడక్ట్ చేసి డిపాజిట్ చేసిన ట్యాక్స్ వివరాలుంటాయి. అదే పార్ట్ బిలో జీతం, డిడక్షన్లు, ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ట్యాక్స్ వివరాలుంటాయి. మీరు ఉద్యోగం మారినప్పుడు ప్రతి యజమాని లేదా కంపెనీ నుంచి వేర్వేరు ఫామ్ 16లు జారీ అవుతాయి. అంటే ఒకే ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు మారితే అన్ని ఫామ్ 16లు ఉంటాయి.
ఒకటి కంటే ఎక్కువ ఫామ్ 16లు ఉంటే ఎలా ఫైల్ చేయాలి
ముందు అన్ని ఫామ్ 16లు సేకరించాలి. ప్రతి ఫామ్ 16లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ప్రతి ఫామ్ 16లో ఆదాయం లేదా జీతంను కూడుకుంటే ఆ ఆర్ధిక సంవత్సరంలో మొత్తం ఆదాయం వస్తుంది. ఇతర ఆదాయాలుంటే అవి కూడా జత చేయాలి. అంటే సేవింగ్ ఎక్కౌంట్లలో వచ్చే వడ్డీ, అద్దె వంటివి.
ఇప్పుడు మొత్తం ట్యాక్సబుల్ ఆదాయం లెక్కించేందుకు మొత్తం ఆదాయాన్ని క్రోడీకరించాలి. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80సి , 80డి వంటి సెక్షన్ల ప్రకారం ట్యాక్స్ మినహాయింపులు, డిడక్షన్లను ఆదాయంలోంచి తీసివేయాలి. ప్రతి కంపెనీ లేదా యజమాని మీ డిడక్షన్లను ప్రకటించి ఉంటే వాటిని ఒకసారే లెక్కించాలి. అంటే ఒకే తరహా డిడక్షన్లు ఎక్కువసార్లు లెక్కించకూడదు. చివర్లో ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఫామ్ 26ఏఎస్‌తో ఫామ్ 16లోని టీడీఎస్ వివరాలు మ్యాచ్ చేసుకోవాలి. మీ కంపెనీ లేదా యజమాని కట్ చేసిన టీడీఎస్ పూర్తిగా మీ పాన్ నెంబర్‌కు క్రెడిట్ అయిందో లేదో పరిశీలించుకోవాలి. మీ ఆదాయం ఆధారంగా మొత్తం చెల్లించాల్సిన ట్యాక్స్ లెక్కించాలి. అప్పటికే కట్ అయిన టీడీఎస్‌తో పోల్చి చూసుకోవాలి. ట్యాక్స్ కంటే టీడీఎస్ అధికంగా ఉంటే రిఫండ్‌కు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఐటీ రిటర్న్స్ ఆన్‌లైన్ ఎలా ఫైల్ చేయాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక పోర్టల్ www.incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులైతే ఐటీఆర్ 1 ఎంచుకోవాలి. అందులో ఆదాయం, డిడక్షన్, టీడీఎస్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. ఓసారి సమీక్షించుకుని సబ్మిట్ చేయాలి. ఐటీ రిటర్న్స్ ఫామ్‌లో అన్ని వివరాలు పరిశీలించుకోవాలి. ఎలాంటి తప్పులు లేదా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. అంతే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
Also read: Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook