Bank jobs: బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారా..అయితే ఇది మీకు శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మరింకేం..ఆ ఉద్యోగాల అర్హత ఇదీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Bank of india ) శుభవార్త విన్పిస్తోంది. నాన్ బ్యాంకింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ ( Jobs recruitment ) కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ( jobs notification ) వెలువరించింది. మొత్తం 21 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ విభాగాల పోస్టులివి. వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు 20 ఉండగా..ఫైర్ ఆఫీస్ విభాగంలో మాత్రం ఒకే ఒక పోస్టు ఉంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల్ని ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 21 దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీగా నిర్ణయించారు. 


కావల్సిన అర్హత 


సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవముండాలి. నవంబర్ 1 నాటికి 25-40 ఏళ్ల వయస్సు మధ్యలో కలిగి ఉండాలనేది ప్రధాన నిబంధన. 


ఇక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత అంశంలో బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి..అదే రంగంలో అనుభవముండాలి.


మరోవైపు Export - Import Bank of India ( EXIM Bank ) కూడా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించింది. ఈ బ్యాంకులో మొత్తం 60 ఖాళీలున్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగి అభ్యర్ధులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎగ్జిమ్ బ్యాంక్ (Exim Bank ) అధికారిక వెబ్‌సైట్ కెరీర్ సెక్షన్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 19 నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. మొత్తం 60 పోస్టుల్లో 8 ఎస్సీలకు, 4 ఎస్టీలకు, 16 ఓబీసీలకు కేటాయించగా..మిగిలినవి జనరల్ కేటగరీలో ఉన్నాయి.  


ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 40 వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలున్నాయి. ఇందులో  Corporate loans & Advances/project trade, Law, International trade & finance/industry, information technology, human resource విభాగాలున్నాయి. విభాగాన్ని బట్టి అర్హత ఉంటుంది. పూర్తి వివరాల్ని ఎగ్జిమ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.eximbankindia.in/  లో చూడవచ్చు.


అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ అభ్యర్ధులకు రాత పరీక్ష తేదీ, సమయం ఎప్పుడనేది సమాచారం అందిస్తారు.