Banners Issue: కర్ణాటకలో మరో వివాదమా..ముస్లింలు స్టాల్స్ పెట్టకూడదంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు
Banners Issue: కర్ణాటకలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదంతో నెలకొన్న పరిస్థితులు మర్చిపోకముందే..జాతరలో వెలిసిన బ్యానర్లు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
Banners Issue: కర్ణాటకలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదంతో నెలకొన్న పరిస్థితులు మర్చిపోకముందే..జాతరలో వెలిసిన బ్యానర్లు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
హిజాబ్ వివాదం కర్ణాటక రాష్ట్రాన్ని ఊపేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు మరోసారి కర్ణాటకలో కొత్త వివాదం రేగుతోంది. మంగళూరు సమీపంలోని బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు ఇందుకు వేదికగా నిలుస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో హఠాత్తుగా వెలిసిన కొన్ని వివాదాస్పద బ్యానర్లుు, ఫ్లెక్సీలే ఇందుకు కారణం. ఈ బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. ముస్లిం సామాజికవర్గానికి చెందినవాళ్లు ఈ స్టాల్స్ వేయకూడదని ఈ బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఉంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. అయితే ఆలయ కమిటీ, ఆలయ పెద్దలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని..తాము ఎవరినీ బ్యాన్ చేయలేదని ప్రకటించింది. ఎవరో దుండగులు కావాలని చేసుంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ శెట్టి తెలిపారు. ఆలయ అధికారులకు గానీ, ఆలయ కమిటీకు గానీ ఏ విధమైన సంబంధం లేదన్నారు. ఎవరూ వ్యాపారం చేసుకోకుండా అడ్డుకోవడం లేదన్నారు.
Also read: Karnataka High Court: అత్యాచారం అత్యాచారమే.. లైంగిక క్రూరత్వానికి వివాహం లైసెన్స్ కాదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook