Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్‌డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య 27.08 కోట్ల బీర్ బాటిల్స్ అమ్ముడుపోగా.. ఏప్రిల్ 2020-నవంబర్ 2020 మధ్య కాలంలో మాత్రం 17.28 కోట్ల బాటిల్స్ మాత్రమే విక్రయాలు జరిగాయని ఉత్తర్ ప్రదేశ్ ఎక్సైస్ శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట. అందుకే ఈ ఏడాది ఎక్సైజ్ పాలసీ (Excise policy 2021-22) ప్రకారం బీర్ విక్రయాలు జరిపే రీటేల్ దుకాణాల లైసెన్స్ ఫీజును, ఎక్సైజ్ డ్యూటీని పెంచకుండా బీరు ధరలను మరో రూ. 20 మేర తగ్గించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీరు ధరలను తగ్గించడం ద్వారా పడిపోయిన బీరు విక్రయాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని యూపీ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. బీరు ధరలను తగ్గించడానికి మరో కారణం కూడా ఉంది. ఇదివరకు ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ కంటే యూపీలోనే బీరు ధరలు అధికంగా ఉన్నాయి. యూపీలో తాజాగా బీరు ధరలు తగ్గించడానికి ఇది కూడా ఓ కారణమైంది. 


Also read : Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


బీరు ధరలను తగ్గించిన ఉత్తర్ ప్రదేశ్ సర్కార్.. ఇండియన్, ఇంగ్లీష్ లిక్కర్‌పై ధరలను 15 నుంచి 20 శాతం వరకు పెంచింది. అంతేకాకుండా ఇండియన్, ఇంగ్లీష్ లిక్కర్ విక్రయాలు జరిపే లిక్కర్ దుకాణాలపై 7.5 శాతం వార్షిక లైసెన్స్ ఫీజును, ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచింది. దీంతో ఏప్రిల్ 1 నుండి బీరు ధరలు (Beer prices) తగ్గనుండగా, డొమెస్టిక్, ఫారెన్ లిక్కర్ ధరలు భారీగా పెరగనున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook