Romance toys recovered from Arpita Mukherjees flat in Bengal: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన తనిఖీల్లో పార్థా సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. డబ్బుతో పాటుగా బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, విలువైన వస్తువులను ఈడీ అధికారులు రికవరీ చేశారు. ఇదంతా అందరికీ తెలిసిందే. తాజాగా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటి శ్రీలేఖ మిత్ర ట్విట్టర్ పోస్ట్‌ ప్రకారం.. అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లో పలు సెక్స్ టాయ్‌లు దొరికాయట. ఈ సెక్స్ టాయ్‌లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఎవరు తీసుకొచ్చారు?, ఎవరు ఉపయోగిస్తున్నారనే విషయంపై ఆమెను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారని సమాచారం. దాంతో అర్పితా ముఖర్జీ-పార్థ ఛటర్జీల వ్యక్తిగత జీవితం లేదా శృంగార జీవితంలోని ముఖ్యమైన అంశాలు బయటకు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. 


మరోవైపు నటి శ్రీలేఖ మిత్ర అర్పితా ముఖర్జీ-పార్థ ఛటర్జీల వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరంగా ఓ పోస్ట్ చేశారు. ఇందుకు సంబందించిన స్క్రీన్‌షాట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ఆహరే.. పార్థబాబు కోరిక తీర్చలేదా?. శృంగారంకు వయస్సు అడ్డంకి కాదు, కులం అడ్డంకి కాదు. ఆ విషయంలో పార్థ విఫలమయ్యాడా?. ఈ విషయాలను దేశం తెలుసుకోవాలనుకుంటుంది' అని శ్రీలేఖ మిత్ర ట్వీటారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 


మరోవైపు అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లో వెండి గిన్నెలు కూడా దొరికినట్లు తెలుస్తోంది. బెంగాలీ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లయిన జంటకు వెండి గిన్నె ఇస్తారు. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో అక్కడ కొనసాగుతుందట. వెండి గిన్నెలు అర్పిత ఫ్లాట్‌కి ఎందుకు వచ్చాయో అని అందరిలో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అర్పితా ముఖర్జీ-పార్థ ఛటర్జీలకు వివాహం అయిందా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. 


Also Read: IND vs WI: తొలి టీ20కి వరణుడి ముప్పు.. మ్యాచ్ జరగడం కష్టమే! ఫలితం మాత్రం పక్కా


Also Read: AP Own TV News Channel: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సొంత టీవీ న్యూస్ ఛానెల్‌ని ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook