Bengaluru: Girl gets lover, 3 friends to kill dad who sexually abused her : లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన తండ్రిని తన బాయ్‌ఫ్రెండ్‌, స్నేహితుల‌తో క‌లిసి అంత‌మొందించింది ఓ 17 ఏళ్ల కూతురు. ఈ కేసులో (Case) కూతురితో పాటు మరో ముగ్గురు మైన‌ర్‌ల‌ను బెంగ‌ళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న తండ్రి దీప‌క్ (45) కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తుండ‌టంతో స్నేహితుల‌తో క‌లిసి హ‌త్య చేసినట్లు కూతురు తెలిపింది. బిహార్‌కు (Bihar) చెందిన దీప‌క్..బెంగళూరులోని (Bengaluru) జీకేవీకే క్యాంప‌స్‌లో సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేసేవాడు. భార్య‌, ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి దీప‌క్ నివ‌సించేవాడు. పెద్ద కూతురు ఓ ప్రైవేట్ కాలేజ్‌లో చ‌దువుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Tomato Price: 20రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ.80 లక్షలపైనే..


దీపక్‌కు ఇద్ద‌రు భార్య‌లు. మొద‌టి భార్య బిహార్‌లో ఉంటోంది. క‌ర్నాట‌క‌కు చెందిన రెండో భార్య, ఆమె ఇద్ద‌రు కూతుర్లతో క‌లిసి దీప‌క్ బెంగ‌ళూర్‌లో ఉండేవాడు. అయితే పెద్ద కూతురి (elder daughter) విషయంలో దీప‌క్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ప‌లుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. 


ఈ విషయంపై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కూడా నిత్యం ఘ‌ర్ష‌ణలు జ‌రిగేవి. ఎప్పటిలాగే మ‌ద్యం సేవించి ఇంటికొచ్చిన దీప‌క్ కూతురుపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈసారి త‌న స్నేహితుల‌ను ఇంటికి పిలిచింది కూతురు. వారితో క‌లిసి తండ్రిని (Father) హ‌త‌మార్చింది.


Also Read : Nara Lokesh slams CM Jagan: జగన్‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook