Smoky paan: కొంప ముంచిన స్మోక్ పాన్.. 12 ఏళ్ల బాలిక పొట్టలో రంధ్రం.. అసలేం జరిగిందంటే..?
Bengaluru news: బెంగళూరుకు చెందిన ఒక మైనర్ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో అంతర్గతంగా రంధ్రం ఏర్పడిందని చెప్పారు.
Minor girl eats smoky paan in bengaluru: కొందరు యువత అతీగా ప్రవర్తిస్తున్నారు. నార్మల్ గా చాలా మందికి పాన్ లు తినడం అలవాటు ఉంటుంది. కొందరు మిఠా పాన్, మసాలాలతో కూడిన పాన్ లు తింటుంటారు. ఇక మార్కెట్ లో వందల రకాల పాన్ లు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. పెళ్లి వేడుకల్లో పాన్ లను తప్పనిసరిగా పెడుతున్నారు. చాలా మంది యువత పాన్ లు వేసుకొవడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ లా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు యువత ఇటీవల కొత్తగా స్మోకీ పాన్ ను ఎక్కువగా తింటున్నారు. ఈ పాన్ ను వేడి వేడిగా ఉండి, తింటుంటే దీని నుంచి పొగలు రావడం మనం గమనిస్తుంటాం. అయితే... బెంగళూరులో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
పూర్తి వివరాలు..
బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికకు స్మోక్ పాన్ తినడం అలవాటైంది. ఆమె ఎక్కువగా ఈ పాన్ ను తినేది. ఈక్రమంలో బాలికకు మొదట్లో విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే బాలికను కుటుంట సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలికకు స్కానింగ్ చేయగా.. ఆమె కడుపులో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. బాలిక లిక్విడ్ నైట్రోజన్‌ని ఉపయోగించి తయారు చేసిన పాపులర్ ‘స్మోకీ పాన్’ని సేవించిడం వల్ల ఈ విధంగా జరిగిందని డాక్టర్ లు తెలిపారు. నివేదికల ప్రకారం, పాన్ తిన్న తర్వాత పొగ పీల్చే వ్యక్తులను చూసిన అమ్మాయి, కూడా వారిని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇదే బాలిక కొంపముంచిందని డాక్టర్లు చెప్పారు. బాలికకు సర్జరీ చేసి ఆమెకు ప్రాణాపాయంలేకుండా వైద్యులు కాపాడారు. ఇప్పుడు బాలిక కొలుకుంటున్నట్లు తెలుస్తొంది.
బెంగళూరులోని ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో ఈ బర్నింగ్ పాన్ లను ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది యువత.. స్మోకీ పాన్‌ని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. ఇక బాలికకు వైద్యులు సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న చిన్న భాగాన్ని తొలగించారు. వైద్యులు బాలికకు కల్గిన ఈ ప్రాబ్లమ్ ను.. పెర్ఫోరేషన్ పెరిటోనిటిస్ అని పిలుస్తుంటారని చెప్పారు. శస్త్రచికిత్స సమయంలో అన్నవాహిక, కడుపు, ఆంత్రమూలం-చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని పరిశీలించినట్లు డాక్టర్ విజయ్ హెచ్‌ఎస్, ఆపరేటింగ్ సర్జన్ తెలిపారు.
ఈ పాన్ లో.. లిక్విడ్ నైట్రోజన్ ఉంటుందని, ఇది కలిపిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయని తెలిపారు. లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువగా రెస్టారెంట్లలోని సిజ్లర్‌లలో ఆహారం లేదా పానీయానికి స్మోకీ(పోగలు) రూపాన్ని అందించడానికి ఉపయోగిస్తారు. ప్రజలు తమ ఇంటి బయట తినే ఫుడ్ ఐటమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter