Karnataka: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బెంగళూరులో అందుకే హై అలర్ట్ విధించారు. పెద్దఎత్తున పిల్లలకు కరోనా వైరస్ సోకడంతో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు విషయమై ఆందోళన వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bengaluru) కరోనా మహమ్మారి ఆందోళన రేపుతోంది. గత కొద్దిరోజులుగా చిన్న పిల్లల్లో పెద్దఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 6 రోజుల్లో 3 వందలమంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నగరంలో హై అలర్ట్ (High Alert in Bengaluru)విధించారు. ముఖ్యంగా ఆగస్టు 5 నుంచి 10వ తేదీ మధ్యలో 127 మంది పదేళ్లలోపు పిల్లలకు, 10 నుంచి 19 ఏళ్లలోపు 174 మంది పిల్లలకు కరోనా సోకినట్టు తెలిసింది. పిల్లల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో బెంగళూరు నగరపాలక, కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు 144 సెక్షన్ విధించారు. పిల్లలకు వ్యాక్సిన్ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. 


కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)ముప్పు పొంచి ఉండటం, థర్డ్‌వేవ్ ఎక్కువగా పిల్లల్ని టార్గెట్ చేయనుందనే నిపుణుల హెచ్చరికలతో బెంగళూరు పరిస్థితి కలవరం కల్గిస్తోంది. రానున్న రోజుల్లో చిన్నారుల్లో కోవిడ్ కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో పిల్లల్ని ఇళ్లలోంచి బయటకు రాకుండా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులదేనని నిపుణులు సూచిస్తున్నారు. 


Also read: ఏపీలో రానున్న రెండ్రోజుల్లో వర్షాలు, 16వ తేదీన అల్పపీడనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook