Bengaluru Water Shortage: వేసవికాలం ప్రారంభానికి ముందే నీటికి కటకట మొదలైంది. తాగునీటితోపాటు వినియోగించుకోవడానికి కూడా నీరు దొరక్క ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో వాటర్‌ ట్యాంకర్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ పరిస్థితి ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో మరింత దారుణంగా ఉంది. సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడితో ప్రజలు బిందెలు, క్యాన్‌లు ఇతర వస్తువులు పట్టుకుని నీళ్లు వచ్చే చోట వరుస కడుతున్నారు. నీటి కోసం బెంగళూరువాసులు పోరాడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Constable Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల పరీక్ష రద్దు


ఇప్పుడు బెంగళూరులో ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజలు బారులుతీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. నల్లాల వద్ద ప్రజలు క్యూలో నిలిచిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలను చూస్తుంటే బెంగళూరుకు ఎంతటి కష్టం వచ్చింది అనక మానరు. కావేరి నదీ జలాల పంపిణీ ఆగిపోవడంతో బెంగళూరులో నీటి ఎద్దడి ఏర్పడిందని సమాచారం. ఐటీ రాజధానిలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. తూర్పు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌, బెలాతూర్‌, మహాదేవపుర తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రజలు నీటి కోసం బారులు తీరారు. నీటి కొరతతో ఇప్పటికే అక్కడి వాటర్‌ బోర్డు 'వీలైనంత తక్కువగా నీటిని వినియోగించండి. నీటి పొదుపును పాటించాలి' అని ప్రజలకు  సూచనలు చేసింది.

Also Read: Modi: నీ మొగుడితో గొడవ జరిగితే మాత్రం మోదీ పేరు చెప్పొద్దు.. మహిళలతో ప్రధాని జోకులు


నీటి ఎద్దడి నేపథ్యంలో బెంగళూరులో అత్యవసర పరిస్థితిగా అధికారులు గుర్తించారు. ఈ సమస్యపై అక్కడి అధికారి రాకేశ్‌ సింగ్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాలతో సమన్వయం చేసుకుని బెంగళూరులో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి కొరత నేపథ్యంలో మహానగరంలో అనూహ్యంగా నీటి ట్యాంకర్లకు భారీ గిరాకీ ఏర్పడింది. డిమాండ్‌ నేపథ్యంలో ట్యాంకర్ల ధర భారీగా పెరిగింది. గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు ధర అడుగుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని బెంగళూరు ప్రజలు కోరుతున్నారు.




నీటి ఎద్దడి తలెత్తడానికి కావేరీ నదీ జలాల అంశం కారణంగా తెలుస్తోంది. త్వరలోనే నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయనున్నట్లు సమాచారం. కుదిరితే తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కావేరీ జలాలను విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరులో తరచూ ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. వర్షాకాలంలో భారీ వరద, ఇప్పుడు వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సమీపిస్తున్న సమయంలో అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు నిలదీస్తున్నారు. ముందే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని చెబుతున్నారు.
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook