Central Govt Banned PUBG New avatar Battlegrounds Mobile India: భారతదేశంలోని గేమింగ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. పబ్‌జీకి సంబందించిన భారతీయ వెర్షన్ 'బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) వీడియో గేమ్‌ బ్యాన్ అయ్యింది. దీనిని భారత దేశంలోని గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ స్టోర్‌ నుంచి తొలగించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే ప్లే స్టోర్ మరియు యాపిల్‌ స్టోర్ నుంచి బీజీఎంఐ అప్లికేషన్‌ను తొలగించారు. పబ్‌జీ వంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడొద్దని హెచ్చరించినందుకు 16 ఏళ్ల బాలుడు తన తల్లిని కాల్చి చంపిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలో 2020 సెప్టెంబర్ మాసంలో పబ్‌జీని బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. దాంతో 2021 జూలైలో క్రాఫ్టన్‌ కంపెనీ 'బ్యాటిల్ గ్రౌండ్‌ ఇండియా' మొబైల్‌గా తిరిగి ఇండియాలో లాంఛ్‌ చేసింది. బీజీఎంఐ గేమింగ్ ఫీచర్‌లు పబ్‌జీ మాదిరిగానే ఉంటాయి. అయితే పబ్‌జీ మరియు బీజీఎంఐ వేర్వేరు గేమ్‌లు అని క్రాఫ్టన్ ఇండియా పేర్కొంది. ఏదేమైనా పబ్‌జీ మాదిరిగానే బీజీఎంఐ కూడా సక్సెస్ అయింది.10 కోట్లకు మించిన డౌన్లోడ్స్‌ తో ఇండియాలో నంబర్ వన్‌ గేమ్‌గా కొనసాగుతోంది.



అయితే యూజర్స్‌ డేటాని విదేశీ సర్వర్లకు ట్రాన్స్‌ ఫర్‌ చేస్తోందనే కారణం ఒకటైతే.. హత్యలు జరగడం మరో కారణంగా ఈ గేమ్‌ని బ్యాన్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పబ్‌జీని కూడా ఇదే కారణంతో బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ప్లే స్టోర్‌ నుంచి బీజీఎంఐ గేమ్ మాయం కాగానే యూజర్లు, గేమింగ్‌ ప్రియులు షాక్ అయ్యారు. క్రాఫ్టన్‌ కంపెనీకి సమాచారం అందించిన తర్వాతే బీజీఎంఐ గేమ్‌ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది కేంద్రం. మరోవైపు ఎందుకు ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ నుంచి బీజీఎంఐ గేమ్‌ని తొలగించారో తమకు ఇంకా తెలియదని క్రాఫ్టన్‌ కంపెనీ అంటుంది. 


Also Read: Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో 'ఆ' టాయ్స్.. పార్థబాబు కోరిక తీర్చలేదా?


Also Read: IND vs WI: తొలి టీ20కి వరణుడి ముప్పు.. మ్యాచ్ జరగడం కష్టమే! ఫలితం మాత్రం పక్కా


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook