Woman Shower Filming: మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ కానిస్టేబుల్ పై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. ఈ ఘటన మరువక ముందే మరో పోలీస్ అధికారిణిని వేధించిన విషయం తాజాగా అదే రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఆమె డ్రైవర్‌ ఏకంగా ఆమె ఇంట్లోనే బాత్రూమ్‌లో కెమెరా(Camera) పెట్టి ఆ వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం అతడిని గాలిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
ఓ పోలీస్‌ అధికారిణికి డ్రైవర్‌గా ఓ కానిస్టేబుల్‌(Constable) విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన కానిస్టేబుల్‌ ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్‌(Bathroom) తలుపుపై వీడియో రికార్డింగ్‌ ఆన్‌ చేసి సెల్‌ఫోన్‌ ఉంచాడు. స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్‌ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్‌ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్‌(Driver) రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.


Also Read: జూబ్లీహిల్స్ లో దారుణం: ఫుడ్ కోర్ట్ వాష్ రూంలో సెల్‌ఫోన్‌ పెట్టి....వీడియోలు రికార్డింగ్


దీంతో ఆమె పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్‌(Bhopal) క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, ‍క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook